Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 8 : షాకింగ్.. హౌస్ నుంచి అవినాష్ అవుట్..!

బిగ్ బాస్ సీజన్ 8 లో అవినాష్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు.

By:  Tupaki Desk   |   28 Oct 2024 6:56 AM GMT
బిగ్ బాస్ 8 : షాకింగ్.. హౌస్ నుంచి అవినాష్ అవుట్..!
X

బిగ్ బాస్ సీజన్ 8 లో అవినాష్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. అదేంటి నిన్న ఆదివారం నాడే కదా మెహబూబ్ ఎలిమినేట్ అయ్యింది. మళ్లీ ఇంతలోనే మరో ఎలిమినేషన్ ఎలా అనుకోవచ్చు. అసలే ఈరోజు మండే అంటే నామినేషన్ డే ఈరోజు అవినాష్ బయటకు రావడం ఆడియన్స్ ని మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది. బిగ్ బాస్ సీజన్ 8 లో అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చాడు. ఏమాటకామాట చెప్పాలంటే హౌస్ లోకి వైల్డ్ కార్డ్స్ వచ్చాకే ఎంటర్టైన్మెంట్ మొదలైంది. అంతేకాదు అవినాష్, రోహిణి కామెడీ షోని నడిపిస్తుంది.

బిగ్ బాస్ సీజన్ 8 లో అవినాష్ తన వంతు పూర్తిగా ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాడు. హోస్ట్ నాగార్జున కూడా వీకెండ్ లో అవినాష్ ని తెగ ఆడేసుకుంటారు. ఐతే సడెన్ గా ఏమైందో ఏమో కానీ అవినాష్ స్టమక్ పెయిన్ అని డాక్టర్ రూమ్ కి వెళ్లాడు. ఆ తర్వాత వచ్చి నొప్పి భరించలేకపోతున్నా నన్ను బయటకు వచ్చేయండి అన్నాడని చెప్పాడు. దాంతో హౌస్ మెట్స్ అంతా షాక్ అయ్యారు. అంతేకాదు హౌస్ అంతా కూడా అవినాష్ వెళ్తున్నాడని ఎమోషనల్ అయ్యారు.

అవినాష్ కేవలం హెల్త్ ఇష్యూ వల్లే హౌస్ నుంచి బయటకు వచ్చాడు. ఐతే అతను మళ్లీ హౌస్ లోకి వెళ్తాడు కానీ అతను బయటకు వెళ్లేప్పుడు దాదాపు వెనక్కి రావడం కష్టం అన్నట్టుగానే చెప్పి వెళ్లాడు. కానీ బయటకు వెళ్లి అతను అన్ని టెస్ట్ లు చేయించుకుని వచ్చాడని తెలుస్తుంది. కొన్నాళ్లు హౌస్ లో ఉండొచ్చు పర్వాలేదు అని చెప్పబట్టే మళ్లీ అవినాష్ హౌస్ లోకి వచ్చాడు.

ఏది ఏమైనా నిన్ననే మెహబూబ్ ఎలిమినేట్ అయ్యి మళ్లీ ఈరోజు అవినాష్ ఇంటి నుంచి బయటకు రావడం ఫ్యాన్స్ కి షాక్ ఇస్తుంది. ఐతే అవినాష్ తిరిగి మళ్లీ హౌస్ లోకి రావడం కూడా ఈరోజు చూపిస్తారా లేదా అన్నది చూడాలి. సోమవారం వచ్చింది అంటే హౌస్ లో నామినేషన్స్ గరం గరం ఉంటుంది. ఈ వారం ఎవరు నామినేట్ అవుతారు. ఎవరు నెక్స్ట్ వీకెండ్ హౌస్ కి బై బై చెబుతారో చూడాలి.

ఈ సీజన్ వైల్డ్ కార్డ్స్ లో టాప్ 5 దాకా ఉండే వారిలో అవినాష్ ఒకడు. అలాంటి అవినాష్ హౌస్ నుంచి అలా సడెన్ గా వెళ్లడం బాధగానే ఉంటుంది. ఐతే హెల్త్ చెకప్ తర్వాత మళ్లీ అతను తిరిగి హౌస్ లోకి వెళ్లడం ఆడియన్స్ ని ఖుషి చేస్తుంది.