Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 8 : ప్రేరణ ఆడపులిలా ఆడేస్తుందిగా..?

బుధవారం ఎపిసోడ్ లోకి వంటలక్క సీరియల్ టీం హౌస్ లోకి రాగా.. వారితో అవినాష్, ప్రేరణ ఆట ఆడి గెలిచారు.

By:  Tupaki Desk   |   12 Dec 2024 5:59 AM GMT
బిగ్ బాస్ 8 : ప్రేరణ ఆడపులిలా ఆడేస్తుందిగా..?
X

బిగ్ బాస్ సీజన్ 8 చివరి వారం ఆటలో మరోసారి తన సత్తా చాటుతుంది ప్రేరణ. మొదటి నుంచి టాస్కుల్లో ఆడపులిలా ఆడుతూ ఆడియన్స్ కు దగ్గరైన ప్రేరణ మధ్యలో కాస్త డల్ అయినట్టు అనిపించినా టాప్ 5 కి వెళ్లాక ఆమె తిరిగి ఫాం లోకి వచ్చింది. ప్రస్తుతం చివరి వారం అవ్వడంతో బిగ్ బాస్ హౌస్ లోకి స్టార్ మా సీరియల్స్ పరివారాన్ని పంపిస్తున్నారు. సీరియల్స్ జోడీని పంపించి హౌస్ లో జోడీలతో ఆట ఆడిస్తున్నారు. బుధవారం ఎపిసోడ్ లోకి వంటలక్క సీరియల్ టీం హౌస్ లోకి రాగా.. వారితో అవినాష్, ప్రేరణ ఆట ఆడి గెలిచారు. ఆ ఆట గెలవడంతో ప్రైజ్ మనీలోకి 10928 రూపాయలు యాడ్ అయ్యాయి.

ఆ నెక్స్ట్ మగువ ఓ మగువ సీరియల్ టీం హౌస్ లోకి వచ్చారు. ఈ క్రమంలో అవినాష్ మరోసారి తన ఎంటర్టైన్మెంట్ తో అదరగొట్టేశాడు. ఇక ఒక బాక్స్ మ్యూజిక్ ప్లే అవుతున్నంతసేపు మార్చుకుంటూ ఉండాలి. ఎవరి దగ్గరైతే ఆగిపోతుందో వారు అందులో రాసినట్టు చేయాలని ఉంటుంది. అలా ప్రేరణ దగ్గరకు బాక్స్ రాగానే మ్యూజిక్ ఆగిపోయింది. దాని వల్ల ఆమె ఈ ఆట అయిపోయే వరకు మాట్లాడకూడదు అని ఉంది. ఆమె తరపున అవినాష్ మాట్లాడాలని రాసి ఉంది.

ఆ తర్వాత అవినాష్ దగ్గరకు రాగానే మ్యూజిక్ ఆగిపోయింది. అందుకు అవినాష్ కు అందరినీ ఫేక్ పొగడ్తలతో మెచ్చుకున్నాడు. నిఖిల్ కు మార్నింగ్ పనులు డ్యాన్స్ రూపంలో చేయాలని టాస్క్ రాగా నబీల్ కు పచిమిర్చి, ఉల్లిపాయలు తినాలని వచ్చింది. ఈ టాస్క్ చివర్లో అవినాష్ ని హౌస్ మెట్స్ అంతా కలిసి రౌండప్ చేశారు. మగువ ఓ మగువ టీం తో గౌతమ్, ప్రేరణ టాస్క్ ఆడి ప్రైజ్ మనీకి 100010 రూపాయల్య్ యాడ్ చేశారు.

మరోపక్క ఎపిసోడ్ లో టాప్ 5 ఏవీలతో వారి జర్నీని చూపించాడు బిగ్ బాస్. మొదట గౌతం ఏవీ చూపించగా ఆ తర్వాత నిఖిల్ ది కూడా జర్నీ చూపించాడు. ఈరోజు అవినాష్, ప్రేరణ, నబీల్ జర్నీ చూపించే ఛాన్స్ ఉంది. సీరియల్ పరివార్ తో బీబీ పరివార్ ఆడిన ఆటలన్నీ బీబీ పరివార్ అదే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గెలుస్తున్నారు. ఇక ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ డిసెంబర్ 15 ఆదివారం జరగనుంది. టైటిల్ విన్నర్ ఎవరు అవుతారన్న సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది.