అవ్‌నీత్ కౌర్ అందాల జాతర
లండన్ లో ఓ ప్రీమియర్ కోసం వెళ్లినప్పటి ఫోటోషూట్ ఇదీ అంటూ వేడెక్కించే ఫోటోలను అవ్ నీత్ ప్రదర్శించింది.
By: Tupaki Desk | 21 Sep 2024 4:04 AM GMTడిజైనర్ లుక్స్ తో కిల్ చేయడంలో అవ్ నీత్ కౌర్ తర్వాతే. ఈ బ్యూటీ కిల్లర్ లుక్ ని ప్రతిసారీ అభిమానులు ప్రశంసించినా, ఒక సెక్షన్ నెటిజనులు మాత్రం యథావిధిగా ఈ బ్యూటీని విమర్శిస్తూనే ఉన్నారు. దీనికి కారణం ఏదైనా కానీ ఇప్పుడు అన్నిటికీ సమాధానం ఇచ్చేందుకు అవ్ నీత్ కొత్త కాన్పెప్టుతో వచ్చింది. అవ్ నీత్ తాజా ఫోటోషూట్ లో తన అందచందాలను ఆరాంగా ప్రదర్శిస్తూ నిజమైన జాతరకు తెర తీసింది. లండన్ లో ఓ ప్రీమియర్ కోసం వెళ్లినప్పటి ఫోటోషూట్ ఇదీ అంటూ వేడెక్కించే ఫోటోలను అవ్ నీత్ ప్రదర్శించింది.
అవనీత్ కౌర్ హిందీ టెలివిజన్ రంగం నుంచి సినీరంగంలో ప్రవేశించింది. కౌర్ మర్దానీలో మీరా పాత్రతో టికు వెడ్స్ షేరులో టికు పాత్రలతో పాపులరైంది. చంద్ర నందినిలో చారుమతి, అలాద్దీన్‌లో యాస్మిన్ - నామ్ తో సునా హోగా చిత్రాల్లో పాత్రలతో ఆకట్టుకుంది. కౌర్ 2010లో జీ TV డ్యాన్స్ షో డాన్స్ ఇండియా డాన్స్ లిల్ మాస్టర్స్‌తో తన వృత్తిని ప్రారంభించింది. అవ్ నీత్ సెమీ-ఫైనల్‌కు ముందే ఎలిమినేట్ అయింది. ఆ తర్వాత డ్యాన్స్ కే సూపర్‌స్టార్స్‌లో పాల్గొంది. ఈ వేదికలో ఆమె `డ్యాన్స్ ఛాలెంజర్స్` బృందంలో చేరింది. కౌర్ 2012లో లైఫ్ ఓకే మేరీ మాతో తన నటనా రంగ ప్రవేశం చేసింది. ఇందులో ఆమె జిల్మిల్ పాత్రను పోషించింది. ఆ తర్వాత SAB TV తేధే హై పర్ తేరే మేరే హైన్‌లో నటించింది. 2012లో, కలర్స్ TV సెలబ్రిటీ డ్యాన్స్ రియాలిటీ షో ఝలక్ దిఖ్లా జాలో పాల్గొంది, అక్కడ ఆమె దర్శీల్ సఫారీతో పోటీ పడింది. ఈ షోలో కనిపించిన అతి పిన్న వయస్కురాలు ఆమె.
అటుపై కౌర్ లైఫ్ ఓకే లో సావిత్రి - ఏక్ ప్రేమ్ కహానీలో నటించింది. అందులో రాజకుమారి దమయంతి పాత్ర పోషించింది. ఆగస్ట్ 2013లో కౌర్ జీ TV ఏక్ ముత్తి ఆస్మాన్‌లో పాఖీ పాత్ర పోషించింది. కౌర్ 2014లో ప్రదీప్ సర్కార్ యొక్క మర్దానితో తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. అటుపై వరుస చిత్రాల్లో నటిస్తోంది. ఆమె సన్నీ సింగ్ సరసన లవ్ కి అరేంజ్ మ్యారేజ్‌లో కూడా నటించింది.