ప్రతిసారీ హాట్ అండ్ బోల్డ్‌గా!
తాజాగా జీక్యూ ఇండియా కవర్ షూట్ లో పాల్గొన్న అవ్ నీత్ షేర్ చేసిన మోడ్రన్ లుక్ పైనా ఫ్యాన్స్ ఒక రేంజులో విరుచుకుపడుతున్నారు.
By: Tupaki Desk | 24 Nov 2023 12:30 AM GMTఅవ్ నీత్ కౌర్ ఇటీవల ట్రెండీగా వినిపిస్తున్న పేరు ఇది. తనదైన అద్భుత నటన.. ఫ్యాషన్ సెన్స్ తో ఈ బ్యూటీ కుర్రకారు గుండెల్లో బలమైన ముద్ర వేసింది. తక్కువ కాలంలో గుర్తింపు తెచ్చుకున్న అందగత్తెల్లో అవ్ నీత్ పేరు చేరింది. అభిమానులు ఎల్లప్పుడూ తన నుంచి సోషల్ మీడియాల్లో కొత్త పోస్ట్‌ల కోసం ఎదురుచూసేలా చేసింది. అవ్నీత్ కౌర్ మోడ్రన్ ఔట్ ఫిట్ లో చాలా హాట్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు అలాంటి ఒక డిజైనర్ లుక్ తో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. కొందరు తన డ్రెస్సింగ్ సెన్స్ ను ప్రశంసిస్తూ ఉన్నా, చాలామంది రకరకాల కారణాలతో ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
నటి అవ్ నీత్ కౌర్ నిండుగా బట్టలు ఎందుకు వేసుకోదు? అని చాలా మంది నెటిజనులు ప్రశ్నిస్తున్నారు. అవ్ నీత్ ఎప్పుడూ ఎక్స్‌పోజ్ చేయాలా? ప్రతిసారీ హాట్ అండ్ బోల్డ్‌గా కనిపించడానికి ప్రయత్నించాలా? అంటూ ఎదురు ప్రశ్నించారు. మితిమీరి ఎందుకు ఎక్స్‌పోజ్ చేయాలి? సాంప్రదాయబద్ధంగా చీరను ఎందుకు ధరించరు? అంటూ కూడా ప్రశ్నించారు. అయితే అవ్ నీత్ ఇంతకుముందు దీపావళి సందర్భంగా చీరలో కనిపించింది. కానీ టూమచ్ హాట్ గా అందాలను ఎలివేట్ చేయడంతో దానిపైనా నెటిజనులు తీవ్రంగా విమర్శించారు.
తాజాగా జీక్యూ ఇండియా కవర్ షూట్ లో పాల్గొన్న అవ్ నీత్ షేర్ చేసిన మోడ్రన్ లుక్ పైనా ఫ్యాన్స్ ఒక రేంజులో విరుచుకుపడుతున్నారు. జీక్యూ కవర్ పేజీ కోసం అవ్ నీత్ ఫోజులు భంగిమలు హీట్ పెంచాయి. బ్లాక్ కలర్ డిజైనర్ డ్రెస్ లో అవ్ నీత్ కిల్లర్ లుక్ ని చాలా మంది అభిమానులు ప్రశంసించినా, ఒక సెక్షన్ నెటిజనులు మాత్రం యథావిధిగా హాట్ కామెంట్లు చేస్తున్నారు.
టీవీ నుంచి వెండితెరకు:
అవనీత్ కౌర్ హిందీ టెలివిజన్ రంగం నుంచి సినీరంగంలో ప్రవేశించింది. కౌర్ మర్దానీలో మీరా పాత్రతో టికు వెడ్స్ షేరులో టికు పాత్రలతో పాపులరైంది. , చంద్ర నందినిలో చారుమతి, అలాద్దీన్‌లో యాస్మిన్ - నామ్ తో సునా హోగా చిత్రాల్లో పాత్రలతో ఆకట్టుకుంది. కౌర్ 2010లో జీ TV డ్యాన్స్ షో డాన్స్ ఇండియా డాన్స్ లిల్ మాస్టర్స్‌తో తన వృత్తిని ప్రారంభించింది. అవ్ నీత్ సెమీ-ఫైనల్‌కు ముందే ఎలిమినేట్ అయింది. ఆ తర్వాత డ్యాన్స్ కే సూపర్‌స్టార్స్‌లో పాల్గొంది. ఈ వేదికలో ఆమె 'డ్యాన్స్ ఛాలెంజర్స్' బృందంలో చేరింది. కౌర్ 2012లో లైఫ్ ఓకే మేరీ మాతో తన నటనా రంగ ప్రవేశం చేసింది. ఇందులో ఆమె జిల్మిల్ పాత్రను పోషించింది. ఆ తర్వాత SAB TV తేధే హై పర్ తేరే మేరే హైన్‌లో నటించింది. 2012లో, కలర్స్ TV సెలబ్రిటీ డ్యాన్స్ రియాలిటీ షో ఝలక్ దిఖ్లా జాలో పాల్గొంది, అక్కడ ఆమె దర్శీల్ సఫారీతో పోటీ పడింది. ఈ షోలో కనిపించిన అతి పిన్న వయస్కురాలు ఆమె.
తరువాత, కౌర్ లైఫ్ ఓకే లో సావిత్రి - ఏక్ ప్రేమ్ కహానీలో నటించింది. అందులో రాజకుమారి దమయంతి పాత్ర పోషించింది. ఆగస్ట్ 2013లో కౌర్ జీ TV ఏక్ ముత్తి ఆస్మాన్‌లో పాఖీ పాత్ర పోషించింది. కౌర్ 2014లో ప్రదీప్ సర్కార్ యొక్క మర్దానితో తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. అటుపై వరుస చిత్రాల్లో నటిస్తోంది. ఆమె సన్నీ సింగ్ సరసన లవ్ కి అరేంజ్ మ్యారేజ్‌లో కూడా నటించనుంది.