తెల్ల చీర..మల్లె పువ్వు లో అందమే అసూయపడేలా
బ్యాక్ గ్రౌండ్ లో అంతే అందమైన సాంగ్ మరింత తన్మయంలో ముంచేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు
By: Tupaki Desk | 6 Dec 2023 11:30 PM GMTతెల్ల చీర..మల్లె పువ్వు. ఆ కాంబినేషన్ బ్యూటీని వర్ణించడం ఎవరికి సాధ్యం. అంతటి గుభాళింపుకు ఎవరైనా తన్మయం చెందాల్సిందే. తాజాగా యంగ్ బ్యూటీ సయి మంజ్రేకర్ అదే కాంబినేషన్ తో యువతని ఆకర్షిస్తుంది. అందమైన తెల్ల చీర పై మ్యాచింగ్ రవిక ధరించి..కొప్పు నిండా మల్లెపువ్వులు ధరించి అందమంతా నా సొంతం... దాన్ని ఆస్వాదించడం మీ సొంతం అంటూ ఇలా నెట్టింట్లోకి వచ్చేసింది.
హోటల్ దగ్గర అలా కారు దిగి చీరందంలో అలా వాక్ చేసుకుంటూ క్యూట్ గా ఓ స్మైల్ ఇస్తుంటే? కాదనలేని వారు ఎవరు? తన బ్యూటీతో...వెలుగు జిలుగులోతో ఆ రాత్రికి ముంబై లో కరెంట్ అవసరం లేదు అనిపించింది. బ్యాక్ గ్రౌండ్ లో అంతే అందమైన సాంగ్ మరింత తన్మయంలో ముంచేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. యంగ్ హీరోయిన్ అభిమానులు అమ్మడిని అలా చూసిఫిదా అవుతున్నారు. వీడియో వన్స్ మోర్ అంటూ ఎన్నిసార్లు చూస్తున్నారో? కూడా లెక్కకు రావడం లేదు సుమీ.
ఇక అమ్మడి కెరీర్ సంగతి చూస్తే! మహేష్ మంజ్రేకర్ వారసురాలిగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సయి మంజ్రేకర్ ఇప్పుడిప్పుడే బిజీ అవుతోంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన అమ్మడు పూర్తి స్థాయి నటిగా మారడానికి మాత్రం ఎక్కువగానే సమయం తీసుకుంది. `దబాంగ్ 3`తో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు టాలీవుడ్ లో లాంచ్ అవ్వడానికి పెద్దగా సమయం తీసుకోలేదు.
వరుణ్ తేజ్ సరసన `గని`.. అడవి శేషు తో `మేజర్` చిత్రాల్లో నటించింది. `మేజర్` సొగసరికి మంచి పేరు తీసుకొచ్చింది. కానీ ఆ విజయాలు టాలీవుడ్ లో బిజీ నటిగా మార్చలేకపోయాయి. అందం..అభినయం అన్నీ ఉన్నా అమ్మడు అవకాశాలు అందుకోవడంలో వెనుకబడే ఉంది. బాలీవుడ్ లోనూ ప్రయత్నాలు చేస్తోంది. కానీ సరైన అవకాశాలు రావడం లేదు.