పెద్ద సినిమాకు రెమ్యునరేషన్ వదిలేసిన హీరో
ఆయలాన్ సినిమాకి తాను ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని, అనుకున్న కథని ప్రేక్షకులకి అందించాలనే తపనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
By: Tupaki Desk | 28 Dec 2023 3:37 AM GMTకోలీవుడ్ లో శివ కార్తికేయన్ కి హీరోగా మంచి గుర్తింపు ఉంది. నాని తరహాలోనే కెరియర్ స్టార్ట్ చేసి తరువాత హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలలో తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. అందుకే దర్శక, నిర్మాతలు మినిమం బడ్జెట్ తో శివ కార్తికేయన్ హీరోగా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
ప్రస్తుతం శివ కార్తికేయన్ ఆయలాన్ మూవీతో పొంగల్ కి ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. ఈ సినిమాపై తమిళనాట భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తమిళ్, తెలుగు భాషలలో తెరకెక్కించారు. శివ కార్తికేయన్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన మూవీ ఇదే కావడం విశేషం. ఈ సినిమాలో గ్రహాంతరవాసి క్యారెక్టర్ ని ఉపయోగిస్తున్నారు.
ఈ క్యారెక్టర్ ని సీజీలో సృష్టించారు. ఈ పాత్ర కారణంగానే మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం తీసుకుంది. రీసెంట్ గా మూవీ ఆడియో ఫంక్షన్ జరిగింది. ఈ ఈవెంట్ లో శివ కార్తికేయన్ ఆసక్తికర విషయాలు తెలియజేశారు. ఆయలాన్ సినిమాకి తాను ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని, అనుకున్న కథని ప్రేక్షకులకి అందించాలనే తపనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
కథ అద్భుతంగా ఉండటం, అలాంటి కథలో తాను భాగం కావడం వలన రెమ్యునరేషన్ గురించి పట్టించుకాలేదని క్లారిటీ ఇచ్చారు. అలాగే మూవీలో గ్రహాంతరవాసి పాత్రకి సిద్ధార్ద్ డబ్బింగ్ చెప్పారని, అతను కూడా ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా వర్క్ చేశారని శివ కార్తికేయన్ క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా సిద్ధార్ధకి శివ కార్తికేయన్ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించగా 4 ఏఎం స్టూడియోస్, ఫాంటమ్ ఎఫ్ఎక్స్ స్టూడియోస్ పతాకాలపై కోటపాడి జె.రాజేష్ ఆయలాన్ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. కచ్చితంగా కోలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రని ఈ సినిమా మార్చేస్తుందని నిర్మాత చాలా నమ్మకంగా చెప్పడం చూస్తుంటే మూవీపై కాన్ఫిడెంట్ గా ఉన్నారని అర్ధమవుతోంది. పొంగల్ రేసులో టాలీవుడ్ నుంచి ఏకంగా ఐదు సినిమాలు రేసులో ఉండటంతో ఆయలాన్ తెలుసు వెర్షన్ ని తెలుగు ప్రజలు చూసే అవకాశం రాకపోవచ్చు అనే మాట ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తోంది.