ఆ డైరెక్టర్ పై అంత నమ్మకం ఎలా?
యశ్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తోన్న ప్రతిష్టాత్మక `ధూమ్` ప్రాంచైజీ ఇంతవరకూ ఫెయిలైంది. ధూమ్ మూడు భాగాలు మంచి విజయం సాధించాయి.
By: Tupaki Desk | 5 Oct 2024 6:04 AM GMTయశ్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తోన్న ప్రతిష్టాత్మక `ధూమ్` ప్రాంచైజీ ఇంతవరకూ ఫెయిలైంది. ధూమ్ మూడు భాగాలు మంచి విజయం సాధించాయి. తొలి రెండు భాగాలకు సంజయ్ గాద్వీ దర్శకత్వం వహించగా మూడవ భాగాన్ని విజయ్ కృష్ణ ఆచార్య తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అందించారు. దీంతో ధూమ్ అంటే ఓ బ్రాండ్ గా మారిపోయింది. ఈ సినిమాకి ఏదర్శకుడు పనిచేసినా అతడిపై ప్రత్యేకమైన ఫోకస్ ఉంటుంది.
ఈ నేపథ్యంలో ధూమ్ -4 చిత్రానికి ఆయాన్ ముఖర్జీని దర్శకుడిగా ఎంపిక చేసినట్లు వినిపిస్తుంది. అయితే ఇతడు ఎంతవరకూ ఈ ప్రాజెక్ట్ ని సక్సెస్ పుల్ గా డీల్ చేస్తాడు? అన్న దానిపై సందేహాలు వ్యక్తమవు తున్నాయి. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన గత చిత్రాలు ‘వేకప్ సిద్’, `యే జవానీ హై దివానీ` రెండూ క్లాసిక్ హిట్లే. సరదాగా సాగిపోయే స్టోరీలు అవి. ఆ తర్వాత యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో `బ్రహ్మస్త్ర` తెరకెక్కించాడు.
కానీ ఈ సినిమా భారీ ఓపెనింగ్ లు సాధించి తప్ప లాంగ్ రన్ లో నిలడలేదు. దీంతో మొదటి భాగం నష్టాల్లోనే ఉంది. పార్ట్ -2 కూడా ఉందన్నారు. కానీ ఇంత వరకూ ఆ ఛాన్స్ తీసుకోలేదు. ప్రస్తుతం ఆయన్ వార్-2 అనే యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని కూడా యశ్ రాజ్ ఫిలింసే నిర్మిస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో `ధూమ్ -4` బాధ్యతలు కూడా ఆయాన్ కే అప్పగించడం ఆసక్తికరంగా మారింది.
వార్ తో హిట్ ఇచ్చిన సిద్దార్ధ్ ఆనంద్ ని పక్కనబెట్టి మరీ ఆయాన్ ని ఎంపిక చేస్తుంది. `వార్ -2` మేకింగ్ చూసి ఈ ఛాన్స్ ఇచ్చినట్లు కనిపిస్తుంది. కానీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తీసిన తొలి సినిమా బ్రహ్మస్త్ర సరైన ఫలితం సాధించకపోయినా? ఆయాన్ ముఖర్జీని తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. అతడిపై యశ్ రాజ్ ఫిలింస్ కి అంత నమ్మకం ఎలా? వార్ -2 వచ్చే ఏడాది రిలీజ్ అవుతుంది. ఆ తర్వాతే ఆయాన్ ఎంతటి పనివంతుడు? అన్నది తెలుస్తుంది.