Begin typing your search above and press return to search.

వార్ 2: ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్స్ గ‌గ్గోలే

యే జవానీ హై దీవానీ, బ్ర‌హ్మాస్త్ర చిత్రాల ద‌ర్శ‌కుడు అయాన్ ముఖర్జీ ఈ భారీ యాక్ష‌న్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు

By:  Tupaki Desk   |   24 Oct 2024 4:54 AM GMT
వార్ 2: ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్స్ గ‌గ్గోలే
X

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వార్ 2 చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. ఆరంగేట్ర‌మే న‌టన‌కు ఆస్కారం ఉన్న ప్ర‌తినాయ‌క ఛాయ‌లున్న పాత్ర‌లో న‌టిస్తున్నాడు. గ్రీక్ గాడ్ హృతిక్ రోష‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తుండ‌గా, అత‌డితో నువ్వా నేనా? అంటూ ఢీకొట్టే పాత్ర‌లో తార‌క్ క‌నిపించ‌బోతున్నాడు. ఇది నిజంగా యంగ్ య‌మ అభిమానుల‌కు స్పెష‌ల్ ట్రీట్ కానుంది. YRF స్పై యూనివర్స్ లో ఇది ఉత్కంఠ రేపుతున్న సినిమా. అత్యంత‌ భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. యే జవానీ హై దీవానీ, బ్ర‌హ్మాస్త్ర చిత్రాల ద‌ర్శ‌కుడు అయాన్ ముఖర్జీ ఈ భారీ యాక్ష‌న్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

తాజా స‌మాచారం మేర‌కు.. దేశంలోని ఇద్ద‌రు అగ్ర హీరోల న‌డుమ ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ ని మునుపెన్న‌డూ చూడ‌ని రీతిలో న‌భూతోన‌భ‌విష్య‌తి అనే రేంజులో అయాన్ తెర‌కెక్కించ‌నున్నార‌ని తెలిసింది. యష్ రాజ్ ఫిలింస్ ప్రధాన నటీనటుల పరిచయ సన్నివేశాలను రాజీ అన్న‌దే లేకుండా మ‌రో లెవ‌ల్లో డిజైన్ చేసిందని, భారీ పెట్టుబ‌డితో ఈ సీన్ ని తెర‌కెక్కిస్తోంద‌ని తెలుస్తోంది. ఏజెంట్ కబీర్‌గా హృతిక్ రోషన్ కత్తి యుద్ధంతో డాషింగ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సన్నివేశాన్ని చైనాలోని షావోలిన్ ఆలయంలో చిత్రీకరించారు.

మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ తన ఇంట్రడక్షన్ బ్లాక్‌లో ఓడలో పైరేట్స్‌తో చేతులు కలుప‌తాడు. ఈ బ్లాక్‌లను పెద్ద స్క్రీన్‌పై చూసే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని మేకర్స్ చెబుతున్నారు. హృతిక్ త‌న ప్ర‌ధాన శ‌త్రువు ఎన్టీఆర్ ని ఢీకొట్టేప్పుడు వీక్ష‌కులు గ‌గ్గోలు పెట్ట‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. ఈ చిత్రంలో హృతిక్ రోషన్‌తో కియారా అద్వానీ రొమాన్స్ చేస్తోంది. 14 ఆగస్ట్ 2025న వార్ 2 థియేటర్లలో విడుదల కానుంది.

ఆర్.ఆర్.ఆర్- దేవ‌ర లాంటి పాన్ ఇండియా హిట్లు అందుకున్న తార‌క్ ఇప్పుడు వార్ 2 లో రెట్టించిన ఉత్సాహంలో న‌టిస్తున్నాడు. అత‌డు ద‌క్షిణాది స్టామినాను ఉత్త‌రాదికి మ‌రోసారి ప‌రిచ‌యం చేస్తాడ‌ని అభిమానులు కూడా రెట్టించిన ఆనందంలో ఉన్నారు. వార్ 2 చిత్రం 2024-25 సీజ‌న్ మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో నిల‌వ‌డానికి తార‌క్ కార‌కుడ‌ని అభిమానులు న‌మ్ముతున్నారు.