ఇండస్ట్రీలో మరో విషాధం!
బాలీవుడ్ డైరెక్టర్ ఆయాన్ ముఖర్జీ తండ్రి, నటుడు దేబ్ ముఖర్జీ శుక్రవారం కన్ను మూసారు. 83 ఏళ్ల దేబ్ ముఖర్జీ కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
By: Tupaki Desk | 14 March 2025 3:51 PM ISTబాలీవుడ్ డైరెక్టర్ ఆయాన్ ముఖర్జీ తండ్రి, నటుడు దేబ్ ముఖర్జీ శుక్రవారం కన్ను మూసారు. 83 ఏళ్ల దేబ్ ముఖర్జీ కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన ముంబైలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1960-70వ దశకంలో దేబ్ ముఖర్జీ అనేక చిత్రాల్లో నటించారు. ఆయన మృతిపట్ల బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కాగా దేబ్ ముఖర్జీ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం ముంబైలోని విలే పార్లేలోని పవన్ హన్స్ శ్మశానవాటికలో జరుగుతాయి. ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరు కానున్నారు. ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. సోషల్ మీడియా వేదకిగా దిగ్బ్రాంతిని వ్యక్తం చేసారు.
దేబ్ ముఖర్జీ 'ఏక్ బార్ మూస్కురా దో '(1972), 'జో జీతా వోహి సికందర్' (1992), 'లాల్ పత్తర్' (1971) వంటి చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. బాలీవుడ్ సినిమా రంగానికి ఆయన చేసిన సేవలతో పాటు, ముంబై సాంస్కృతిక రంగంలో దేబ్ ముఖర్జీ గణనీయమైన పాత్ర పోషించారు. అక్కడ జరిగే దుర్గా పూజ వేడుకల్లో ఒకటైన నార్త్ బాంబే సర్బోజానిన్ దుర్గా పూజ పండల్ నిర్వాహకులలో ఆయన ఒకరు .
దేబ్ ముఖర్జీ తనయుడే దర్శకుడు ఆయాన్ ముఖర్జీ. ప్రస్తుతం బాలీవుడ్ లో యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హృతిక్ రోషన్- ఎన్టీఆర్ తో `వార్ 2` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇది ఆన్ సెట్స్ లో ఉంది. అయితే తండ్రి కన్నుమూయడంతో తాత్కాలికంగా ఆ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది.