Begin typing your search above and press return to search.

చరణ్ ఆన్‌ స్క్రీన్‌ సిస్టర్‌ ఇప్పుడు ఇలా..!

పదేళ్ల క్రితం వచ్చిన ఆ సినిమాలో అయేషా చిన్న పాప గా కనిపించింది.

By:  Tupaki Desk   |   25 Oct 2024 6:10 AM GMT
చరణ్ ఆన్‌ స్క్రీన్‌ సిస్టర్‌ ఇప్పుడు ఇలా..!
X

రామ్‌ చరణ్‌ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'గోవిందుడు అందరివాడేలే' సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కమర్షియల్‌గా ఫలితం ఎలా ఉన్నా ఆ సినిమా చరణ్‌ కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమా అనడంలో సందేహం లేదు. ఒక చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సాగే ఆ సినిమాలో హీరోయిన్‌గా కాజల్‌ అగర్వాల్‌ నటించింది. ఇద్దరి కాంబో సన్నివేశాలకు మంచి మార్కులు పడ్డాయి. అదే సినిమాలో రామ్‌ చరణ్‌ సిస్టర్ పాత్రలో అయేషా కాదుస్కర్‌ నటించింది. పదేళ్ల క్రితం వచ్చిన ఆ సినిమాలో అయేషా చిన్న పాప గా కనిపించింది. కానీ ఇప్పుడు అయేషా హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా చాలా అందంగా ఉందని కామెంట్స్ వస్తున్నాయి.


సోషల్‌ మీడియాలో అయేషా కాదుస్కర్‌ రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఉత్తరాది స్టార్‌ హీరోయిన్స్ కి ఏమాత్రం తక్కువ కాకుండా ఉందని, తప్పకుండా ఈమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తే మంచి ఆఫర్లు వస్తాయనే అభిప్రాయంను తెలుగు ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ రెగ్యులర్‌గా పోస్ట్‌లు షేర్‌ చేస్తూ ఉండే అయేషా కి ఇన్‌స్టా గ్రామ్‌లో దాదాపు మూడు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇండస్ట్రీలో ఇంకా పూర్తి స్థాయిలో అడుగు పెట్టక ముందే ఈ స్థాయిలో ఫాలోవర్స్ ఉన్నారంటే ఏ స్థాయిలో ఆమె అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.

పలు హిందీ సినిమాల్లో బాల నటిగా, ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించి మెప్పించింది. బుల్లితెరపైనా ఈమెకు మంచి గుర్తింపు ఉంది. గోవిందుడు అందరి వాడేలే సినిమా తర్వాత తెలుగు లో పెద్దగా కనిపించలేదు. ఒకటి రెండు ఆఫర్లు వచ్చినా ప్రాముఖ్యత లేవు అనే ఉద్దేశ్యంతో తిరస్కరించిందని తెలుస్తోంది. మొత్తానికి రామ్‌ చరణ్ కి చెల్లిగా గోవిందుడు అందరి వాడేలే సినిమాలో నటించిన అయేషా కాదుస్కర్‌ కి సోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ ఉంది. అప్పుడు చిన్నగా క్యూట్‌గా ఉన్న అయేషా ఇప్పుడు చాలా అందంగా కుర్రకారు మతి పోగొట్టే విధంగా ఉందంటూ నెటిజన్స్‌ ఆమె ఫోటోలకు తెగ కామెంట్స్ చేస్తున్నారు.

టాలీవుడ్‌ లో హీరోయిన్‌గా ఈమెకు అవకాశాలు వస్తే నటిస్తుందా అనేది చూడాలి. త్వరలోనే ఈమె హీరోయిన్‌గా సినిమాలు చేసి మెప్పిస్తుందని సోషల్‌ మీడియా ఫోటోలు చూస్తూ ఉంటే అర్థం అవుతుంది. ఆకట్టుకునే విధంగా అందం ఉండటంతో పాటు, మంచి నటన ప్రతిభ ఇంకా మంచి ఫిజిక్ ఉన్న అయేషా తప్పకుండా ఇండస్ట్రీలో ముందు ముందు స్టార్‌డం దక్కించుకోవడం ఖాయం. అయితే ఆమె దృష్టి మొత్తం బాలీవుడ్‌ పై ఉన్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఆమె సౌత్‌లోనూ నటించేందుకు ఓకే చెప్పేనో చూడాలి. ఇక రామ్‌ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం గేమ్‌ ఛేంజర్ సినిమాను చేస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ఆ సినిమా రాబోతుంది. మరో వైపు బుచ్చి బాబు దర్శకత్వంలో సినిమాకు రెడీ అవుతున్నాడు.