పిక్ టాక్ : బ్లాక్ ఔట్ ఫిట్‌లో కిల్లింగ్ లేడీ
హీరోయిన్ పాత్రల్లో నటించడం కోసం తాపత్రయ పడుతున్న ఈ అమ్మడు మెల్ల మెల్లగా అటువైపుగా వెళ్తుంది.
By: Tupaki Desk | 16 Jan 2025 6:30 PM GMTతెలుగు ప్రేక్షకులకు ఓం భీమ్ బుష్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మనమే సినిమాలతో పరిచయం అయిన ముద్దుగుమ్మ ఆయేషా ఖాన్. మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలతో ఆకట్టుకుంటూ ఉంది. హిందీ బిగ్ బాస్ సీజన్ 17లో కనిపించిన ఈ అమ్మడు ఆ తర్వాత బుల్లి తెరపై చాలా షోల్లోనూ నటించి హిందీ ప్రేక్షకులకు చేరువ అయ్యింది. హిందీ సినిమాల్లో ప్రయత్నిస్తున్న సమయంలో టాలీవుడ్ నుంచి ఈ అమ్మడికి ఛాన్స్‌లు వచ్చాయి. హీరోయిన్ పాత్రల్లో నటించడం కోసం తాపత్రయ పడుతున్న ఈ అమ్మడు మెల్ల మెల్లగా అటువైపుగా వెళ్తుంది.
ఏక్తా కపూర్ యొక్క కసౌతి జందగీ కే ఆకట్టుకున్న ఆయేషా ఖాన్ బుల్లి తెరపై హీరోయిన్ రేంజ్ గుర్తింపు దక్కించుకుంది. మంచి ఫిజిక్‌తో పాటు హీరోయిన్స్ రేంజ్‌లో స్కిన్ షో చేయడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. హిందీ సినిమా ఇండస్ట్రీలో చిన్నా చితకా ఆఫర్లు వచ్చినా పెద్దగా పట్టించుకోని ఈ అమ్మడు టాలీవుడ్‌లో సినిమా ఆఫర్లు దక్కించుకుంది. అందమైన ఈ అమ్మడు తెలుగులో మొదటగా ముఖచిత్రం అనే సినిమాలో నటించింది. ఆ సినిమాతో పెద్దగా గుర్తింపు రాలేదు. అయినా తన ప్రయత్నం ఆపలేదు. తెలుగులో సినిమా ఆఫర్లు సొంతం చేసుకుంటూనే ఉంది.
తాజాగా సోషల్ మీడియా ద్వారా ఈ అమ్మడు అందమైన ఫోటోలను షేర్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 5.5 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ అంటూ నెటిజన్స్ రెగ్యులర్‌గా ఈమె ఫోటోలకు ఫిదా అవుతూ కామెంట్స్ చేస్తు ఉంటారు. తాజాగా బ్లాక్ డ్రెస్‌లో ముక్కు పుడకతో కవ్వించే చూపులతో స్టైలిష్ ఫోజ్ ఇచ్చిన ఈ అమ్మడి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తెలుగులో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో ఈమె ఒక పాటలో కనిపించి కన్నుల విందు చేసింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో రూపొందుతున్న జాట్ సినిమాలో నటిస్తోంది. సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాతో బాలీవుడ్‌లో మొదటి సారి కనిపించబోతుంది. ఈసారిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల విడుదల అయిన ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన దక్కింది. అందుకే ఈ సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంటే తప్పకుండా బాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా ఆయేషా ఖాన్ నిలిచే అవకాశాలు ఉన్నాయి.