బాలి దీవుల్లో నటి స్వేచ్ఛా విహారం
ఇప్పుడు బాలి నుంచి స్పషల్ ట్రీట్ అందిస్తోంది మరో యువకథానాయిక.
By: Tupaki Desk | 13 Feb 2025 1:30 AM GMTఒంటరి దీవుల్లో స్వేచ్ఛా విహారాన్ని కోరుకోనిది ఎవరు? విదేశీ బీచ్ లు అయితే ఆ మజా వేరుగా ఉంటుంది. మాల్దీవులు, ఫిజీ, బాలి (ఇండోనేషియా) వంటి ఒంటరి దీవులు ఎప్పుడూ స్వేచ్ఛా విహారానికి వెల్ కం చెబుతాయి. ఇటీవల పలువురు బాలీవుడ్ కథానాయికల మల్దీవుల విహారానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు బాలి నుంచి స్పషల్ ట్రీట్ అందిస్తోంది మరో యువకథానాయిక.
తాజాగా బాలీవుడ్ భామ ఐషా శర్మ 'బాలి' విహారయాత్ర నుంచి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. వీటిలో ఐషా స్వేచ్ఛా విహారం యువతరాన్ని ఆకర్షించింది. ఐషా తన ముఖవర్చస్సు కోసం, టాన్ క్లియర్ చేసుకునేందుకు ముఖానికి ఫేసియల్ క్రీమ్ తో కనిపించింది. ఈ బ్యూటీ పూల్ సైడ్ ట్రీట్ కి సిద్ధమైంది. బీచ్ సైడ్ రిసార్ట్స్‌లో రీజనవేషన్ కోసం ప్రత్యేకించి తయారు చేసిన ద్రావణానికి సంబంధించిన వీడియోను కూడా ఐషా సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనికి ఆసక్తికర వ్యాఖ్యను జోడించింది.
నెమ్మదిగా ఉదయం, మృధువైన ఆచారాలు.. నాతో నేను ప్రశాంతంగా ఉండటాన్ని ఆస్వాధిస్తాను. నేను ఎలా ఉండాలనుకుంటున్నానో దానికి ప్రతిరోజూ ఒక అడుగు దగ్గరగా ఉన్నాను.. అని వ్యాఖ్యానించింది. అయితే ప్రధాని మోదీ ప్రకారం.. సెలబ్రిటీలు విదేశీ విహారయాత్రల కంటే భారతదేశ పర్యాటకం వృద్ధికి సహకరించేలా స్థానిక ఎగ్జోటిక్ లొకేషన్లను సెలబ్రిటీలు, ప్రజలు ఎంపిక చేయాలి. ఈ రూల్ ప్రకారం.. విదేశాల్లో షికార్లు తగ్గించిన కొందరు భామలు, స్వదేశంలో ఎగ్జోటిక్ లొకేషన్లకు ప్రాధాన్యతనిస్తున్నారు. గోవా, పారా దీప్, లక్షద్వీప్ వంటి దీవులకు వెళుతున్నారు. విదేశీ ఒంటరి దీవిలో స్వేచ్ఛను కోరుకున్న శర్మా గాళ్ బాలీ దీవులకు వెళ్లింది. ఈ సృష్టిలో అందమైన ప్రపంచాన్ని, అరుదైన ప్రదేశాలను వీక్షించే స్వేచ్ఛ అందరికీ ఉంది.