Begin typing your search above and press return to search.

వాలెంటైన్ రెడ్ లో GOG బ్యూటీ స్టన్నింగ్

సినిమాల్లో ఐటెం సాంగ్స్ ఇప్పుడు కామన్ అయిపోయాయి. మాస్ సినిమాల్లో అయితే కచ్చితంగా ఐటెం సాంగ్ ఉండాల్సిందే

By:  Tupaki Desk   |   14 Feb 2024 9:45 AM GMT
వాలెంటైన్ రెడ్ లో GOG బ్యూటీ స్టన్నింగ్
X

సినిమాల్లో ఐటెం సాంగ్స్ ఇప్పుడు కామన్ అయిపోయాయి. మాస్ సినిమాల్లో అయితే కచ్చితంగా ఐటెం సాంగ్ ఉండాల్సిందే. ఇక ఈ ఐటెం సాంగ్స్ కోసం స్టార్ హీరోయిన్లతో పాటు లేటెస్ట్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన గ్లామరస్ భామలను ను తీసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ ఐటెం గర్ల్ గా ఎంట్రీ ఇస్తోంది ఓ బాలీవుడ్ నటి.


ఇటీవల హిందీలో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 17 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఆయేషా ఖాన్.. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గ్యాంగ్స్ అఫ్ గోదావరి మూవీలో ఐటెం సాంగ్ తో అలరించనుంది. ఇప్పటికే ఈ సాంగ్ కు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయింది. మరికొద్ది రోజుల్లో ఆయేషా తన మాస్ డ్యాన్స్ తో కుర్రకారును మైమరపించనుంది. తెలుగులో ఈమె చేస్తున్న మొదటి ఐటెం సాంగ్ ఇదే.

మరోవైపు, సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుందీ బ్యూటీ. స్టైలిష్ తోపాటు ట్రెడిషనల్ ఔట్ ఫిట్స్ తో ఫొటోలు దిగి అమ్మడు సందడి చేస్తుంటుంది. కుర్రకారు మతులు పోగొడుతుంటుంది. తాజాగా వాలెంటైన్స్ డే స్పెషల్ గా రొమాంటిక్ రీల్ ను పోస్ట్ చేసింది. రెడ్ కలర్ సింగిల్ పీస్ లాంగ్ డ్రెస్ లో బాలీవుడ్ సాంగ్ కు తన ఎక్స్ప్రెషన్స్ తో అదరగొట్టింది. కొంటె చూపులతో మాయ చేస్తోంది. రకరకాల యాంగిల్స్ లో అందాలు ఆరబోసింది.

ఆయేషా ఖాన్ వాలెంటైన్స్ డే ట్రీట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. టాలీవుడ్ కు సూపర్ ఐటెం గర్ల్ దొరికిందంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో బ్యూటీ మాస్ ట్రీట్ కు వెయిటింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అమ్మడు గ్లామర్ కు దాసోహం అంటున్నారు. ప్రస్తుతం ఆయేషా ఖాన్ రీల్ ఫుల్ వైరల్ గా మారింది.

మోడల్ గా కెరీర్ స్టార్ చేసింది ఆయేషా ఖాన్. 2003లో మెహందీ టీవీ సీరియల్ తో యాక్టింగ్ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. స్లాంజ్‌ బారెరెన్, మాన్-ఓ-సల్వా, చార్ చంద్, ఖుదా జమీన్ సే గయా నహిన్, వాస్ల్ సీరియళ్లతో మంచి పేరు సంపాదించుకుంది. జవానీ ఫిర్ నహీ అనే మూవీతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. 2022లో ముఖచిత్రం మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి GOG మూవీలో స్పెషల్ సాంగ్ తో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.