Begin typing your search above and press return to search.

ఆయేషా స్టెప్పులకు మైండ్ బ్లాకే!

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ఛాన్స్ కొట్టేసి ఒక్కసారి లైమ్ లైట్ లోకి వచ్చింది బాలీవుడ్ బ్యూటీ ఆయేషా ఖాన్

By:  Tupaki Desk   |   15 Jun 2024 2:30 PM GMT
ఆయేషా స్టెప్పులకు మైండ్ బ్లాకే!
X

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ఛాన్స్ కొట్టేసి ఒక్కసారి లైమ్ లైట్ లోకి వచ్చింది బాలీవుడ్ బ్యూటీ ఆయేషా ఖాన్. ఆ సినిమాలోని మోత మోగిపోద్ది సాంగ్ లో ఓ ఊపు ఊపేసింది. తనదైన అందం, అభినయంతో ఆకట్టుకుంది. అంతకు ముందే యంగ్ హీరో శ్రీవిష్ణు ఓం భీమ్ బుష్ లో ఛాన్స్ దక్కించుకున్నా.. విశ్వక్ మూవీతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఓం భీమ్ బుష్ లో కూడా తన నటనతో ఆకట్టుకుంది.

అయితే కొన్నేళ్ల క్రితం విశ్వక్ గెస్ట్ రోల్ లో నటించిన ముఖచిత్రం సినిమాతో టాలీవుడ్‌ కు పరిచయమైన అమ్మడు.. ఆ తర్వాత కేవలం సీరియల్స్‌కే పరిమితమైంది. హిందీ బిగ్‌ బాస్‌ సీజన్-17 తర్వాత అవకాశాలు దక్కించుకుని మళ్లీ తెలుగు ఇండస్ట్రీపై ఫోకస్ చేసింది. ఇప్పుడు వరుస ఆఫర్లు అందుకుంటున్నట్లు తెలుస్తోంది. మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్‌ నటిస్తున్న మరో తెలుగు చిత్రం లక్కీ భాస్కర్‌ లో స్పెషల్‌ సాంగ్‌ తో కనువిందు చేయనుంది.

సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నా.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోంది ఆయేషా ఖాన్. ఎప్పటికప్పుడు కొత్త పిక్స్ షేర్ చేస్తూ ఫాలోవర్స్ పెంచుకుంటోంది. పొట్టి డ్రెస్సులతో పాటు శారీల్లో కూడా ఫోటో షూట్స్ పోస్ట్ చేస్తుంటోంది. నెట్టింట ట్రెండింగ్ లో ఉన్న సాంగ్స్ కు రీల్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ఆ సమయంలో చీరలతో ఎక్కువగా డ్యాన్స్ చేసే బ్యూటీ.. ఈ సారి ఫుల్ ఫిట్టెడ్ లాంగ్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేసింది.

తాజాగా అదిరిపోయే ర్యాప్ సాంగ్ కు ఓ రేంజ్ లో డ్యాన్స్ చేసింది ఆయేషా ఖాన్. అందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. 'నేను ఇలా డ్యాన్స్ చేయగలనని అతనికి తెలియదు' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. మెరూన్ కలర్ టైట్ ఫిట్ డ్రెస్ లో వయ్యారాలు ఒలకబోస్తూ డ్యాన్స్ తో అలరించింది. హిప్ స్టెప్పులతో కేక పుట్టించింది. ఎవరైనా ఫ్లాట్ అయ్యేలా స్టెప్పులు వేస్తూ మాయ చేస్తోంది. వేరే లెవెల్ లో ఎక్స్ప్రెషన్స్ ఇస్తోంది ఆయేషా.

పిక్స్ తోనే కాదు డ్యాన్స్ తో కూడా ఇప్పుడు సెగలు పుట్టిస్తోంది అమ్మడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఆయేషా స్టెప్పులకు ఫిదా అయిపోతున్నారు. చూపులతోనే క్లీన్ బౌల్డ్ చేస్తుందని చెబుతున్నారు. ఆయేషా అందాల ఆరబోతకు ఫిదా అయ్యామని అంటున్నారు. ముద్దుగుమ్మ వీడియోకు లైకుల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. కామెంట్ల బాక్స్ కూడా నింపేస్తున్నారు. మరి ఆ వీడియో మీరు చూశారా?