Begin typing your search above and press return to search.

GOG బ్యూటీ స్టన్నింగ్ లుక్స్.. అలా చూస్తూ!!

లావెండర్ కలర్ షైనింగ్ టైట్ ఫిట్ డ్రెస్ లో మెరుపులు మెరిపించింది ఆయేషా ఖాన్. ఓ అవార్డు అందుకున్నట్లు క్యాప్షన్ ఇచ్చింది. ఆ అవార్డును పట్టుకుని క్రేజీగా పోజులిచ్చింది.

By:  Tupaki Desk   |   13 May 2024 10:27 AM GMT
GOG బ్యూటీ స్టన్నింగ్ లుక్స్.. అలా చూస్తూ!!
X

ఆయేషా ఖాన్.. కుర్రాళ్ల క్రష్ లిస్ట్ లోకి ఇటీవల చేరింది ఈ ముద్దుగుమ్మ. ముంబైలో పుట్టిన ఆయేష.. బుల్లితెరపై జూనియర్‌ ఆర్టిస్ట్‌ గా తన కెరీర్‌ ను స్టార్ట్ చేసింది. బాలవీర్‌ రిటర్న్స్‌ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత తనకు వచ్చిన అవకాశాలను అస్సలు మిస్ చేసుకోకుండా అందుకుంటూ దూసుకుపోతోంది. హిందీ బిగ్‌ బాస్‌ షోతో ఫుల్‌ క్రేజ్‌ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. టాలీవుడ్ లో ఇప్పుడు మంచి ఆఫర్లు దక్కించుకుంటోంది.

అయితే ముఖచిత్రం సినిమాతో టాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయేష.. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు సీరియల్స్‌ కే పరిమితమైంది. గత ఏడాది హిందీ బిగ్ బాస్ 17వ సీజన్ లో పార్టిసిపేట్ చేసింది. హౌస్ లో అందచందాలతో ఆకట్టుకుని.. బయటకొచ్చాక మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇటీవల ఏం భీమ్ బుష్ సినిమాలో ప్రియదర్శికి జోడీగా నటించి మంచి మార్కులు కొట్టేసింది.

ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు సందడి మాములుగా ఉండదు. ట్రెండింగ్ సాంగ్స్ కు రీల్స్ చేస్తూ ఓ రేంజ్ లో ఫాలోవర్స్ పెంచుకుంటోంది. మెసేజ్ ఓరియంటెడ్ వీడియోలు కూడా పోస్ట్ చేస్తుంటోంది. శారీల్లో అందాల ఆరబోస్తూ నెటిజన్లు క్లీన్ బౌల్డ్ చేస్తోంది. సెగలు పుట్టించే పిక్స్ ను షేర్ చేస్తుంటోంది. కచ్చితంగా డైలీ తన పేజ్ చెక్ చేయాలనిపించేలా అలరిస్తుంటోంది. తాజాగా కారులో దిగిన ఫోటోలను పోస్ట్ చేసి ట్రెండింగ్ లోకి వచ్చింది.

లావెండర్ కలర్ షైనింగ్ టైట్ ఫిట్ డ్రెస్ లో మెరుపులు మెరిపించింది ఆయేషా ఖాన్. ఓ అవార్డు అందుకున్నట్లు క్యాప్షన్ ఇచ్చింది. ఆ అవార్డును పట్టుకుని క్రేజీగా పోజులిచ్చింది. సింగిల్ హ్యాండ్ డ్రెస్ లో వేరే లెవల్ లో స్కిన్ షో చేసింది. ఎద అందాలతో కుర్రాళ్లను కిక్కిచ్చేలా కూర్చుంది. మొత్తానికి ఆమె పిక్స్ ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. టాలీవుడ్ లక్కీ అండ్ బ్యూటీ గర్ల్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఆయేషా ఖాన్ అంటేనే అందమని బ్యూటీని ఆకాశానికెత్తేస్తున్నారు. ఇక త్వరలోనే విశ్వక్‌ సేన్‌ హీరోగా రాబోతున్న గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి మూవీలో ఐటెం సాంగ్‌ తో అలరించనుంది. దుల్కర్‌ సల్మాన్‌ లక్కీ భాస్కర్‌ మూవీలో కూడా స్పెషల్‌ సాంగ్‌ తో కనువిందు చేయనుంది. మరిన్ని ఆఫర్లు ఆమె చేతిలో ఉన్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. మరి ఆయేషా ఖాన్.. కొత్త చిత్రాలతో ఎలాంటి పేరు సంపాదించుకుంటుందో చూడాలి.