Begin typing your search above and press return to search.

బాహుబలి మళ్లీ సూపర్ హిట్..!

కానీ బాహుబలి స్క్రిప్ట్‌ తో యానిమేషన్‌ ప్రీమేక్‌ చేసేందుకు అంగీకరించాడు, అంతే కాకుండా దానికి నిర్మాతగా కూడా వ్యవహరించాడు.

By:  Tupaki Desk   |   7 July 2024 9:59 AM GMT
బాహుబలి మళ్లీ సూపర్ హిట్..!
X

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి రెండు పార్ట్‌ లు కూడా భారీ వసూళ్లు నమోదు చేసి ఇండియన్‌ బాక్సాఫీస్ వద్ద ఇప్పటికి కూడా టాప్‌ సినిమాలు కూడా కొనసాగుతున్న విషయం తెల్సిందే.

బాహుబలికి దక్కిన ఆధరణ నేపథ్యంలో సినిమాకు సీక్వెల్‌ చేయాలని చాలా మంది కోరుకున్నారు. కానీ రాజమౌళి మాత్రం అందుకు ఆసక్తి చూపించలేదు. కానీ బాహుబలి స్క్రిప్ట్‌ తో యానిమేషన్‌ ప్రీమేక్‌ చేసేందుకు అంగీకరించాడు, అంతే కాకుండా దానికి నిర్మాతగా కూడా వ్యవహరించాడు.

డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ లో బాహుబలి : క్రౌన్ ఆఫ్‌ బ్లడ్‌ అనే టైటిల్‌ తో యానిమేషన్ మూవీ వచ్చింది. తెలుగు తో పాటు మొత్తం ఏడు భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ వెబ్‌ సిరీస్ కి ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. మొదటి రెండు ఎపిసోడ్స్ ను స్ట్రీమింగ్‌ చేయడం జరిగింది.

ఆ తర్వాత వారానికి ఒకటి చొప్పున మొత్తం ఇప్పటి వరకు ఏడు ఎపిసోడ్స్ ను స్ట్రీమింగ్‌ చేశారు. మొత్తం వెబ్‌ సిరీస్‌ కి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో యూనిట్‌ సభ్యులు సీజన్‌ 2 కోసం ఏర్పాట్లు చేస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి.

రాజమౌళి స్క్రిప్ట్‌ విషయంలో తన ఇన్‌పుట్స్‌ ఇచ్చారు అనే వార్తలు వస్తున్నాయి. ఈ వెబ్‌ సిరీస్ కి ది లెజెండ్‌ ఆఫ్ హనుమాన్‌ తో ప్రశంసలు దక్కించుకున్న దర్శక ద్వయం కాంగ్ మరియు నవీన్ జాన్ లు దర్శకత్వం వహించారు. శోభు యార్లగడ్డ తో కలిసి రాజమౌళి ఈ సిరీస్ ను నిర్మించారు. సీజన్‌ 2 కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.