ఇండస్ట్రీలో ఆయన్ని కలిస్తే పవన్ తో పనైపోయినట్లేనా?
ప్రభుత్వ అధికారుల్ని ఎవరినైనా పరిశ్రమ నుంచి కలవాల నుకుంటూ ఈజీగా కలవగలుగుతున్నారు.
By: Tupaki Desk | 7 Oct 2024 6:07 AM GMTఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిత్ర పరిశ్రమకు అన్నిరకాలుగా అనుకూలంగా ఉన్న సంగతి తెలిసిందే. టికెట్ ధరల విషయంలో పెంచుకునే వెసులుబాటు ఉంది. అధిక షోలు వేసు కోవడానికి అనుమతులు సులభంగా దొరుకుతున్నాయి. ఇంకా చాలా విషయాల్లో ప్రభుత్వం-పరిశ్రమ మద్య ఎంతో చక్కని అనుబంధం కొనసాగుతుంది. ప్రభుత్వ అధికారుల్ని ఎవరినైనా పరిశ్రమ నుంచి కలవాల నుకుంటూ ఈజీగా కలవగలుగుతున్నారు.
ఈసారి ప్రభుత్వంలో పరిశ్రమ నుంచి నటుడు పవన్ కళ్యాణే స్వయంగా డిప్యూటీ సీఎం కావడంతో మరింత వెసులుబాటు దక్కుతోంది. మరి చిత్ర పరిశ్రమ-పవన్ మధ్య కళ్యాణ్ మధ్య వారధి ఎవరు? అంటే ఓ దర్శకుడి పేరు ప్రముఖంగా తెరపైకి వస్తోంది. అంటే త్రివిక్రమ్. ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వానికి తమ సమస్యల్ని ఎలా తీసుకెళ్లాలి? అంటే త్రివిక్రమ్ ని కలిస్తే పని అయిపోయినట్లుగానే సీన్ ఉందిట. ఇండస్ట్రీ నుంచి దర్శకులు, నిర్మాతలు ఇంకా వవరైతే వారు ప్రభుత్వంతో ఏదైనా పని ఉంటే వెళ్లి త్రివిక్రమ్ ని కలిసి చెప్పుకుంటే చాలు సమస్య డిప్యూటీ సీఎం దగ్గరకు వెళ్లిపోతుందిట.
సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యవహారాలను పూర్తి స్వయంప్రతిపత్తితో నిర్వహించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి అధికారం ఇచ్చారని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ ఇండస్ట్రీ నుంచి తన ప్రతినిధిగా త్రివిక్రమ్ ని నియమించారుట.
తన తరపున ఈ వ్యవహారాలను నిర్వహించమని ఆ బాధ్యతలు అన్నింటిని త్రివిక్రమ్‌కు అప్పగిం చారుట. అధికారికంగా ఎలాంటి ప్రకటన లేనప్పటికీ నమ్మకం అనే కాన్సెప్ట్ మీద ఇద్దరు ముందు కెళ్తున్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య నిర్మాత అశ్విని దత్ కూడా తన సినిమా `కల్కి` టిక్కెట్ ధర పెంపుపై చర్చలు జరపడానికి పవన్ కళ్యాణ్ ద్వారా త్రివిక్రమ్‌ను సంప్రదించాల్సి వచ్చిందని అన్నారు.