Begin typing your search above and press return to search.

బాబు మోహ‌న్ పై మ‌ర్డ‌ర్ స్కెచ్!

అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో బాబు మోహ‌న్ తృటిలో ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకున్న విష‌యాన్నిరివీల్ చేసారు.

By:  Tupaki Desk   |   6 March 2025 4:00 AM IST
బాబు మోహ‌న్ పై మ‌ర్డ‌ర్  స్కెచ్!
X

బాబు మోహ‌న్ సినీ ప్ర‌స్థానం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. న‌టుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కించుకున్న న‌టుడాయ‌న‌. క‌మెడియ‌న్ గా త‌న‌కంటూ తెలుగు ప‌రిశ్ర‌మ‌లో కొన్ని పేజీలు రాసిపెట్టారు. అలాగే రాజ‌కీయాల్లోనూ చ‌క్రం తిప్పారు. ప్ర‌స్తుతం సినిమా...రాజ‌కీయం రెండు రంగాల‌కు దూరంగా ఉంటున్నారు. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో బాబు మోహ‌న్ తృటిలో ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకున్న విష‌యాన్నిరివీల్ చేసారు.

అసంగ‌తేంటో ఆయ‌న మాట‌ల్లోనే, ' రోజుకు 30 పాన్ లు తినేవాడిని. నాకు ఎప్ప‌టి నుంచో ఉన్న అల‌వాటు అది. అప్ప‌ట్లో నా నియోజ‌క వ‌ర్గం ప్ర‌వేశ ద్వారా సంగారెడ్డి వ‌ద్ద ఓ పాన్ షాప్ చూసుకున్నాను. పాన్ ఎలా క‌ట్టాలి? అన్న‌ది అత‌డికి నేను నేర్పించి పెట్టుకున్నాను. తిరిగి హైద‌రాబాద్ రావ‌డానికి నాకు నాలుగైదు పాన్ లు అయినా ఉండాలి. వెళ్లిన‌ప్పుడ‌ల్లా అక్క‌డ క‌ట్టించుకుని వ‌చ్చేవాడిని.

క‌ట్టించుకున్న వెంట‌నే అక్క‌డే పాన్ వేయ‌ను. మ‌ధ్య‌లో కూడా ఎక్క‌డా వేయ‌ను. మెయిన్ రోడ్ ఎక్కిన త‌ర్వాత పాన్ వేసుకోవ‌డం అల‌వాటు. మెయిన్ రోడ్డు ఎక్కిన వెంట‌నే నాకు ఎస్పీ నుంచి ఫోన్ కాల్ వ‌చ్చింది. బాబు మోహ‌న్ గారు మీరు ఫ‌లానా చోట‌ పాన్ తీసుకున్నారా? అని అడిగారు. అవున‌ని చెప్పాను. దానికి ఆయ‌న వ‌ద్దొద్దు తిన‌కండి అన్నారు. ఏంటి ఈయ‌న పాన్ తినొద్దు అంటాడు? అని నేను పాన్ విప్పి నోట్లో వేసుకోబోతున్నాను.

ఈలోగా మ‌రో ఫోన్ కాల్ వ‌చ్చింది. 'సాబ్ పాన్ న‌యి కానా. ఉస్మే గెహ‌రే యి' . అందులో విష‌ముంది అని ఓ లేడీ అన్నారు. ఆమె ఫోన్ లో నే ఏడుస్తుంది. ఏంట‌బ్బా అనుకుని పాన్ ప‌డేస్తున్నా? ఇంత‌లో మ‌ళ్లీ ఎస్పీ గారు ఫోన్ చేసారు. సీరియ‌స్ గా చెబుతున్నా. మీపాన్ లో విష‌ముంది. పాన్ తిన‌కండి సార్ అన్నారు. ప‌డేయండి అని చాలా సీరియ‌స్ గా అన్నారు. అప్ప‌టి నుంచి పాన్ తిన‌డం మానేసాను. ఇప్ప‌టికీ తిన‌డం లేదు' అని అన్నారు.