Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ ముందు అట్లీ ప్లాన్ క్లిక్కవ్వలేదుగా..

అయితే ప్రస్తుతం ఈ సినిమాకి వస్తోన్న టాక్ చూస్తుంటే 'పుష్ప 2' మూవీకి 21వ రోజు వచ్చిన కలెక్షన్స్ కంటే తక్కువగా 'బేబీ' జాన్ కి వస్తాయనే మాట వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   25 Dec 2024 12:14 PM GMT
అల్లు అర్జున్ ముందు అట్లీ ప్లాన్ క్లిక్కవ్వలేదుగా..
X

వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా హిందీలో 'బేబీ జాన్' మూవీ రిలీజ్ అయ్యింది. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమిళంలో అట్లీ దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన 'తెరి'కి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని హిందీలో అట్లీ నిర్మించగా అతని శిష్యుడు కలీస్ దర్శకత్వం వహించాడు. ఆయనకిది రెండో సినిమా. కమర్షియల్ యాక్షన్ చిత్రంగా 'బేబీ జాన్' చిత్రాన్ని తెరకెక్కించారు.

సౌత్ ఇండియన్ స్టైల్ కమర్షియల్ హీరో ఇమేజ్ కథలని బాలీవుడ్ ప్రేక్షకులు ఆదరిస్తూ ఉండటంతో 'బేబీ జాన్' కూడా సూపర్ హిట్ అవుతుందని అట్లీ ఎక్స్ పెక్ట్ చేశాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్ ఎన్నడూ లేనంత గ్లామర్ రోల్ లో కనిపించింది. ఇదిలా ఉంటే తాజాగా రిలీజ్ అయిన ఈ చిత్రానికి మిశ్రమ రివ్యూలు వస్తున్నాయి.

ప్రస్తుతం హిందీలో 'పుష్ప 2' ప్రభంజనం నడుస్తోంది. మూడో వారంలో కూడా ఐకాన్ స్టార్ క్రేజ్ తో ఈ చిత్రానికి సాలిడ్ కలెక్షన్స్ వస్తున్నాయి. ఆదివారం 27 కోట్ల వరకు వసూళ్లు అందుకున్న ఈ చిత్రం మంగళవారం 11.50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. 'బేబీ జాన్' మూవీ 'పుష్ప 2' జోరుని నిలువరిస్తుందని బిటౌన్ లో టాక్ వినిపించింది.

అయితే ప్రస్తుతం ఈ సినిమాకి వస్తోన్న టాక్ చూస్తుంటే 'పుష్ప 2' మూవీకి 21వ రోజు వచ్చిన కలెక్షన్స్ కంటే తక్కువగా 'బేబీ' జాన్ కి వస్తాయనే మాట వినిపిస్తోంది. 'పుష్ప 2' కంటే బెటర్ వసూళ్లు బేబీ జాన్ కి వచ్చే ఛాన్స్ ఉందని మరో వర్గం నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఈ మూవీ రిజల్ట్ ఏంటనేది గురువారానికి పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం బిటౌన్ లో వినిపిస్తోన్న టాక్ అయితే 'పుష్ప 2' జోరుకి 'బేబీ జాన్' బ్రేక్ లు వేసే ఛాన్స్ అయితే లేదంట. ఆ సినిమాకి పాజిటివ్ మౌత్ టాక్ ఏమైనా వస్తే వీకెండ్ లో కలెక్షన్స్ పెరగొచ్చని అనుకుంటున్నారు. 'పుష్ప 2' మూవీ ముఖ్యంగా రాజస్థాన్, మహారాష్ట్ర, బీహార్, గుజరాత్ లాంటి రాష్ట్రాలలో మంచి వసూళ్లు సాధించింది.

అయితే 'బేబీ జాన్' ప్రభావం హిందీ రాష్ట్రాలలో రూరల్ ప్రాంతాలలో ఉండదని అనుకుంటున్నారు. అట్లీ 'జవాన్' సినిమాతో ఇప్పటికే హిందీలో 1000 కోట్ల కలెక్షన్స్ అందుకున్నాడు. ఆ క్రేజ్ బేబీ జాన్ కి కలిసొస్తుందని అనుకున్నారు. అయితే అల్లు అర్జున్ క్రేజ్ ని పోల్చుకుంటే అట్లీ, వరుణ్ ధావన్ ఇమేజ్ నిలువరించలేకపోయిందనే మాట వినిపిస్తోంది.