బేబీ జాన్.. కరెక్ట్ మీటర్ సెట్..!
త్వరలో రాబోతున్న బేబా జాన్ సినిమా సినిమా కూడా అలాంటి ప్రయత్నం చేశారు.
By: Tupaki Desk | 10 Dec 2024 6:03 AM GMTసౌత్ లో సినిమా హిట్ అయితే ఆ కథ బాలీవుడ్ కి వెళ్లడం అనేది చాలా కామన్. కుదిరితే పాన్ ఇండియా రిలీజ్ లేదంటే మాత్రం ఇక్కడ సక్సెస్ అయిన కథ పట్టుకెళ్లి అక్కడ రీమేక్ చేస్తారు. ఐతే పాయింట్ అలానే ఉంచి అక్కడ పరిస్థితులకు తగినట్టుగా మార్చేస్తారు. త్వరలో రాబోతున్న బేబా జాన్ సినిమా సినిమా కూడా అలాంటి ప్రయత్నం చేశారు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన తెరి రీమేక్ గా బేబీ జాన్ వస్తుంది. నిజానికి చాలా రోజులుగా మీడియా డిస్కషన్స్ లో ఉంది ఈ సినిమా.
క్రిస్ మస్ కానుకగా డిసెంబర్ 25న సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించిన ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజైంది. ఇప్పటికే టీజర్ తో పాటు సాంగ్స్ తో అంచనాలు పెంచిన బేబీ జాన్ సినిమా లేటెస్ట్ ట్రైలర్ తో సూపర్ అనిపించేసింది. కలీస్ డైరెక్ట్ చేసిన బేబీ జాన్ సినిమాలో వరుణ్ ధావన్, కీర్తి సురేష్, వామిక గబ్బి ప్రధాన పాత్రలుగా నటించారు. ఈ సినిమా ట్రైలర్ తో ఆడియన్స్ లో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ట్రైలర్ ను పూణెలో రిలీజ్ చేశారు. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో దర్శక నిర్మాతలు పాల్గొన్నారి. బేబీ జాన్ సినిమాను తెరి సినిమా దర్శకుడు అట్లీ సమర్పకుడిగా ఉన్నారు.
ట్రైలర్ విషయానికి వస్తే సినిమా తెరి రీమేక్ అన్నట్టు కాకుండా కంప్లీట్ గా మాస్ సినిమాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ట్రైలర్ లో వరుణ్ ధావన్ ట్రాన్స్ఫర్మేషన్ యాక్షన్ బాగున్నాయి. అటు క్లాస్ ఇటు మాస్ రెండు కలగలిపి అన్నట్టుగా ట్రైలర్ ఇంప్రెస్ చేసింది. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో వరుణ్ ధావన్ స్పీచ్ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఈ సినిమాలో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నాడు. ఈ సినిమా తనకు ఒక ఎమోషనల్, పవర్ ఫుల్ జర్నీ అని అన్నాడు. ఈ పాత్రలో నటించడం తనకు ఒక మంచి ఎక్స్ పీరియన్స్ అందించిందని.. ట్రైలర్ సినిమాకు శాంపిల్ మాత్రమే సినిమా తప్పకుండా మీ అంచనాలను అందుకుంటుందని అన్నారు. ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ కోసం తాను ఎదురుచూస్తున్నా అని అన్నారు.
ఇదే ఈవెంట్ లో బేబీ జాన్ నిర్మాత సినీ 1 స్టూడియోస్ అధినేత మురాద్ ఖేతని మాట్లాడుతూ.. బేబీ జాన్ ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామా విత్ హ్యుమన్ ఎమోషన్స్.. ట్రైలర్ రెస్పాన్స్ అదిరిపోయింది. ఈ సినిమా అందరికీ మర్చిపోలేని ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని అన్నారు.
తెరి సినిమా దర్శకుడు అట్లీ బేబీ జాన్ కు సమర్పకుడిగా ఉన్నారు. ఈ ట్రైలర్ ఈవెంట్ లో పాల్గొన్న అట్లీ కూడా ఇది ఇప్పుడు చెప్పాల్సిన కథ. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉంటూనే సమాజంలో జరుగుతున్న క్రిటికల్ ఇష్యూస్ గురించి ప్రస్తావించారు. మంచి తండ్రి ఎలా ఉండాలో చెప్పే సినిమా.. పిల్లల్ని ఎలా పెంచాలి పేరెంటింగ్ షేప్ ఎలా ఉంటే సొసైటీ బాగుంటుంది అన్నది ఈ సినిమాలో ఉంటుంది. ఈ సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉందని అన్నారు.
బేబీ జాన్ సినిమాను జియో స్టూడియోస్ అసోషియేషన్స్ లో అట్లీ, సినీ 1 స్టూడియోస్ కలిసి యాపిల్ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మించారు. సినిమా ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.