బేబీ జాన్… ఇక కోలుకోవడం కష్టమే
భారీ అంచనాల మధ్యలో థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రం మొదటి రోజు కేవలం 11 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకుంది. సినిమాకి మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి.
By: Tupaki Desk | 27 Dec 2024 10:54 AM GMTవరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బేబీ జాన్’ గ్రాండ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. తమిళ్ హిట్ మూవీ ‘తెరి’కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా కలీస్ దర్శకత్వంలో రూపొందింది. ఒరిజినల్ మూవీకి దర్శకత్వం వహించిన అట్లీ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఒరిజినల్ లో ఉన్న కథకి కాస్తా పవర్ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ జోడించి ‘బేబీ జాన్’ సినిమాని హిందీలో రెడీ చేశారు. జాకీ ష్రాఫ్ ఈ చిత్రంలో పవర్ ఫుల్ విలన్ గా నటించారు.
తమిళ్ కమర్షియల్ మసాలా ఎలిమెంట్స్ ఏ మాత్రం మిస్ చేయకుండా అంతే ఊరమాస్ గా హిందీలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేశారు. కీర్తి సురేష్ బాలీవుడ్ డెబ్యూ మూవీ కావడంతో ఈ చిత్రంపై చాలా హోప్స్ పెట్టుకుంది. అలాగే కాస్తా గ్లామర్ డోస్ కూడా పెంచి ఈ చిత్రంలో కీర్తి కనిపించింది.
ప్రమోషన్స్ లో కూడా కీర్తి సురేష్ కాస్తా గ్లామర్ అవుట్ ఫిట్ లతోనే సందడి చేసింది. అయితే ఆమె కష్టానికి తగిన ప్రతిఫలం ఈ చిత్రం ఇవ్వలేదని చెప్పాలి. భారీ అంచనాల మధ్యలో థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రం మొదటి రోజు కేవలం 11 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకుంది. సినిమాకి మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి.
ఇక రెండో రోజుకి కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అయిపోయాయి. కేవలం 3.90 కోట్ల నెట్ మాత్రమే ఈ మూవీ వసూళ్లు చేసింది. దీనిని బట్టి సినిమా ప్రేక్షకులకి ఏ మాత్రం కనెక్ట్ కాలేదని అర్ధమవుతోంది. ఈ సినిమా ఎంత ప్రభావం చూపించిన ఈ వీకెండ్ వరకు మాత్రమే ఉంటుందని బిటౌన్ లో వినిపిస్తుంది. 75 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ చిత్రం థియేటర్స్ లోకి వచ్చింది.
ప్రస్తుతం మూవీ సిచువేషన్ చూస్తుంటే 50 శాతం షేర్ కూడా వచ్చే అవకాశాలు కనిపించడం లేదని అనుకుంటున్నారు. ఈ ఏడాది బాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్ జాబితాలో ‘బేబీ జాన్’ కూడా చేరడం దాదాపు ఖాయం అయిపోయిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. వరుణ్ ధావన్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. అలాగే సల్మాన్ ఖాన్ కూడా ఈ చిత్రంలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చారు. అయిన కూడా ఈ చిత్రం ఏ మాత్రం ఆడియన్స్ ని మెప్పించలేదు.