Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్: పుష్ప 2 ముందు తేలిపోయిన బేబీ జాన్

'పుష్ప 2' మూవీ 22వ రోజు కలెక్షన్స్ తో పోల్చుకుంటే 'బేబీ జాన్' 2వ రోజే పూర్తిగా తేలిపోయిందని అర్ధమవుతోంది. దీనిని బట్టి ఈ సినిమా టాక్ ఏంటనేది అంచనా వేయవచ్చు.

By:  Tupaki Desk   |   27 Dec 2024 6:21 AM GMT
బాక్సాఫీస్: పుష్ప 2 ముందు తేలిపోయిన బేబీ జాన్
X

బాలీవుడ్ లో వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జోడీగా నటించిన 'బేబీ జాన్' ఈ నెల 25న విడుదలకు విషయం తెలిసిందే. ఇక సినిమాకి మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఈ మూవీ 'పుష్ప 2' సినిమా కలెక్షన్స్ జోరుని ఆపుతుందని కొంతమంది అంచనా వేశారు. అయితే మూడో వారంలో కూడా పుష్ప 2 మూవీ సక్సెస్ ఫుల్ వసూళ్లని రాబడుతోంది. బేబీ జాన్ మాత్రం రెండో రోజే చేతులెత్తేసింది.

'పుష్ప 2' మూవీ ఇప్పటికే 1700 కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టింది. హిందీలో కూడా750 కోట్ల గ్రాస్ దాటేసింది. నార్త్ లో మూవీ వసూళ్ల జోరు మాత్రం తగ్గడం లేదు. 22వ రోజు ఈ మూవీ హిందీలో 7.2 కోట్లు నెట్ వసూళ్లు చేసింది. హిందీలో ఈ సినిమా 7,170 షోలలో ప్రదర్శించబడింది. 21.20% ఆక్యుపెన్సీతో 8.06 కోట్ల గ్రాస్ కలెక్ట్ అయ్యింది. ఇందులో 7.2 కోట్ల నెట్ ఉంది.

నిజంగా ఇది డీసెంట్ కలెక్షన్స్ అని చెప్పొచ్చు. అయితే 'బేబీ జాన్' రిలీజ్ అయిన రెండో రోజే కలెక్షన్స్ దారుణంగా డ్రాప్ అయిపోయాయి. అట్లీ లాంటి స్టార్ డైరెక్టర్ ఈ సినిమా వెనుక ఉన్న కూడా ఆడియన్స్ ఈ మూవీ పైన పెద్దగా ఆసక్తి చూపించలేదు. అలాగే వరుణ్ ధావన్ క్రేజ్ కూడా ఏ మాత్రం ప్రేక్షకులని రప్పించలేదు.

దీంతో ఈ చిత్రానికి రెండో రోజు కేవలం 3.7 కోట్ల నెట్ మాత్రమే సాధించినట్లు తెలుస్తోంది. 8,711 షోలలో కేవలం 8.51% ఆక్యుపెన్సీతో 4.20 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అందులో 3.7 కోట్ల నెట్ ఉంది. 'పుష్ప 2' కలెక్షన్స్ తో పోల్చుకుంటే అందులో 60 శాతం లోపే 'బేబీ జాన్' వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది.

'పుష్ప 2' మూవీ 22వ రోజు కలెక్షన్స్ తో పోల్చుకుంటే 'బేబీ జాన్' 2వ రోజే పూర్తిగా తేలిపోయిందని అర్ధమవుతోంది. దీనిని బట్టి ఈ సినిమా టాక్ ఏంటనేది అంచనా వేయవచ్చు. ఇక కీర్తి సురేష్ ఈ చిత్రంపై చాలా హోప్స్ పెట్టుకుంది. అయితే ఆమె ఎక్స్ పెక్టేషన్స్ ని ఈ మూవీ ఏ మాత్రం రీచ్ కాలేదని తెలుస్తోంది. 'జవాన్' సినిమాతో అట్లీ ఇప్పటికే బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని 1000 కోట్ల క్లబ్ లో చేరాడు.

అయిన ఈ సినిమాకి అతని ఇమేజ్ ఏ మాత్రం ఉపయోగపడలేదు. రెండో రోజుకే 'బేబీ జాన్' కలెక్షన్స్ ఈ స్థాయిలో ఉంటే వీకెండ్ తరువాత కంప్లీట్ గా డ్రాప్ అయిపోయే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ సినిమా మేకర్స్ కి భారీ నష్టాలు తీసుకొచ్చే అవకాశం ఉందనే మాట ఇప్పుడు వినిపిస్తోంది.