బేబీ ప్రేమ మేఘాలు.. మళ్లీ ఇలా..!
ఐతే ఈ సినిమాతో ఆనంద్, వైష్ణవి చైతన్యల జోడీ కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.
By: Tupaki Desk | 2 Jan 2025 5:34 AM GMTఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటించిన బేబీ సినిమా సూపర్ హిట్ అయ్యింది. లవ్ స్టోరీతో వచ్చినా సరే ఇప్పటి జనరేషన్ కి తగినట్టుగా ఈ సినిమా ఉంది. సాయి రాజేష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను మాస్ మూవీ మేకర్స్ లో ఎస్.కె.ఎన్ నిర్మించారు. సినిమాకు మ్యూజిక్ కూడా బాగా హెల్ప్ అవ్వడంతో సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఐతే ఈ సినిమాతో ఆనంద్, వైష్ణవి చైతన్యల జోడీ కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. బేబీ జోడీ మళ్లీ జత కట్టి సినిమా చేస్తే చూడాలని ఆడియన్స్ కోరుతున్నారు.
అందుకే వాళ్లిద్దరితో ఒక క్రేజీ మూవీ ప్లాన్ చేస్తున్నారు సితార ఎంటర్టైన్మెంట్స్. ఈ మధ్య వరుస సినిమాలతో సితార బ్యానర్ అదరగొట్టేస్తుంది. ఓ పక్క స్టార్స్ తో సినిమాలు చేస్తూనే మరోపక్క మీడియం రేంజ్ సినిమాలు చేస్తున్నారు. ఆనంద్, వైష్ణవి చైతన్య కలిసి రెండో సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాను #నైంటీస్ వెబ్ సీరీస్ డైరెక్ట్ చేసిన ఆదిత్య హాసన్ డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది.
ఆల్రెడీ కథా చర్చలు ముగిసిన ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుందని టాక్. ఈ సినిమాకు ఓ రెండు ప్రేమ మేఘాలిలా టైటిల్ ని పెట్టాలని చూస్తున్నారు. బేబీ లో ఓ రెండు ప్రేమ మేఘాలిలా సాంగ్ సూపర్ హిట్ కాగా ఇప్పుడు ఆ టైటిల్ తోనే వాళ్ళిద్దరు కలిసి సినిమా చేయనున్నారు. బేబీ హిట్ కాంబో రిపీట్ చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా ఫలితం కూడా అదే రేంజ్ లో వస్తుందని ఆడియన్స్ భావిస్తున్నారు.
ఆనంద్ దేవరకొండకు బేబీ హిట్ కెరీర్ కు మంచి బూస్టింగ్ ఇచ్చినా మళ్లీ ఆ తర్వాత ట్రాక్ తప్పుతున్నాడు. ప్రస్తుతం అతని సినిమాలు రెండు సెట్స్ మీద ఉన్నాయి. ఐతే #నైంటీస్ తో సూపర్ హిట్ అందుకుని డైరెక్ట్ గా తన మార్క్ చూపించిన ఆదిత్య హాసన్ ప్రేమలు తెలుగు వెర్షన్ రైటర్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు కాబట్టి తప్పకుండా ఈ కాంబినేషన్ ఒక సూపర్ హిట్ సినిమా అందిస్తుందని చెప్పొచ్చు. మరి బేబీ కాంబో సినిమా ఈసారి ఎలాంటి బజ్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఓ రెండు ప్రేమ మేఘాలిలా సినిమాకు కూడా మ్యూజిక్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటించిన బేబీ సినిమా సూపర్ హిట్ అయ్యింది. లవ్ స్టోరీతో వచ్చినా సరే ఇప్పటి జనరేషన్ కి తగినట్టుగా ఈ సినిమా ఉంది. సాయి రాజేష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను మాస్ మూవీ మేకర్స్ లో ఎస్.కె.ఎన్ నిర్మించారు. సినిమాకు మ్యూజిక్ కూడా బాగా హెల్ప్ అవ్వడంతో సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఐతే ఈ సినిమాతో ఆనంద్, వైష్ణవి చైతన్యల జోడీ కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. బేబీ జోడీ మళ్లీ జత కట్టి సినిమా చేస్తే చూడాలని ఆడియన్స్ కోరుతున్నారు.
అందుకే వాళ్లిద్దరితో ఒక క్రేజీ మూవీ ప్లాన్ చేస్తున్నారు సితార ఎంటర్టైన్మెంట్స్. ఈమధ్య వరుస సినిమాలతో సితార బ్యానర్ అదరగొట్టేస్తుంది. ఓ పక్క స్టార్స్ తో సినిమాలు చేస్తూనే మరోపక్క మీడియం రేంజ్ సినిమాలు చేస్తున్నారు. ఆనంద్, వైష్ణవి చైతన్య కలిసి రెండో సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాను #నైంటీస్ వెబ్ సీరీస్ డైరెక్ట్ చేసిన ఆదిత్య హాసన్ డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది.