Begin typing your search above and press return to search.

సినిమా రివ్యూలు.. బేబీ డైరెక్టర్ ప్రశ్నలు

సినిమాల విషయంలో ఎవరి ఒపీనియన్ వారికి ఉంటుంది. ఈ మధ్యకాలంలో సినిమా రివ్యూలపైన చిత్ర దర్శక, నిర్మాతలు, అలాగే యాక్టర్స్ కూడా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   21 Nov 2023 4:49 AM GMT
సినిమా రివ్యూలు.. బేబీ డైరెక్టర్ ప్రశ్నలు
X

సినిమాల విషయంలో ఎవరి ఒపీనియన్ వారికి ఉంటుంది. ఈ మధ్యకాలంలో సినిమా రివ్యూలపైన చిత్ర దర్శక, నిర్మాతలు, అలాగే యాక్టర్స్ కూడా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కోట్ల రూపాయిలు పెట్టుబడి పెట్టి తీసే సినిమా కష్టం తెలియకుండా మీరు రివ్యూలు రాసేసి పబ్లిక్ చూడాలా, చూడకూడదా అనేది డిసైడ్ చేసేస్తున్నారు అని విమర్శలు చేస్తున్నారు.

గత దశాబ్దకాలం నుంచి రివ్యూలు రాసే ఫిల్మ్ క్రిటిక్స్ కి సినిమావాళ్ళకి మధ్య కొంత వివాదం నడుస్తూనే ఉంది. హిందీలో రివ్యూల నేపథ్యంలో దుల్కర్ సల్మాన్ హీరోగా ఒక మూవీ వచ్చింది. మలయాళంలో ఓ నిర్మాత ఏకంగా రివ్యూలపై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో అయితే సెలబ్రిటీలు వెర్సస్ ఫిల్మ్ క్రిటిక్స్ అనే విధంగా సోషల్ మీడియాలో న్యూస్ లు వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఓ ఈవెంట్ లో బేబీ దర్శకుడు సాయి రాజేష్ వెబ్ సైట్ లలో కొత్త సినిమాలకి రివ్యూలు రాసే ఫిల్మ్ క్రిటిక్స్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. మొదటిసారి సెలబ్రిటీలు స్టేజ్ క్రింద నుంచి ఫిల్మ్ జర్నలిస్టులకి ప్రశ్నలు సందించారు. అందులో భాగంగా సాయి రాజేష్ రివ్యూలపై ఆసక్తికరమైన జర్నలిస్టుకి వేశారు. చాలా మంది రివ్యూ రైటర్స్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన సినిమాకి కూడా 3.75 నుంచి ఆ పైన రేటింగ్స్ ఇచ్చిన దాఖలాలు గత దశాబ్దంలో కనిపించలేదు.

మీ దృష్టిలో గొప్ప సినిమా అంటే ఏంటి. ఈ పాయింగ్ లో మీరు రివ్యూలకి రేటింగ్స్ ఇస్తారు. అసలు 4 స్టార్ రేటింగ్ ఇచ్చే దమ్ము మేము ఇస్తున్న సూపర్ హిట్ సినిమాలలో లేదని మీ అభిప్రాయమా అని అడిగారు. అయితే దీనికి జర్నలిస్ట్ ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. రివ్యూలు రాసేవారు ఫస్ట్ డే మొదటి షో చూసి తన పర్సప్షన్ లో ఏదైతే ఫీల్ అవుతున్నాడో దానిని రాస్తాడు. రివ్యూలు ఏవీ అందరూ డిసైడ్ చేసుకొని రాసినవి కాదని క్లారిటీ ఇచ్చారు.

అయితే చాలా వెబ్ సైట్స్ రివ్యూలు రాసేటపుడు 2.75 నుంచి 3.25 మధ్యనే ఎక్కువగా రేటింగ్స్ ఇస్తూ ఉంటాయి. ఇందుకు రివ్యూలు రాసేటపుడు ఈ సేఫ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తున్నారు అంటూ సాయి రాజేష్ అడిగారు. ఫిల్మ్ క్రిటిక్ సినిమా చూసే సమయంలో కొన్ని స్కేల్స్ ఫాలో అవుతారు. కావాలని సేఫ్ గేమ్ కోసం అలా రేటింగ్స్ ఇవ్వడం జరగదు అంటూ చెప్పుకొచ్చారు. రివ్యూల విషయంలో ఎవరి వాదన వారికి ఎప్పుడూ ఉంటుంది. దీనిపై ఎప్పటికి స్పష్టత వచ్చే అవకాశం ఉండదని సోషల్ మీడియాలో వినిపిస్తోన్న మాట