Begin typing your search above and press return to search.

బేబీ క్యాస్టింగ్.. రెమ్యునరేషన్ లెక్కలు ఇవే..!

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి, విరాజ్ అశ్విన్ లీడ్ రోల్స్

By:  Tupaki Desk   |   22 July 2023 5:56 AM GMT
బేబీ క్యాస్టింగ్.. రెమ్యునరేషన్ లెక్కలు ఇవే..!
X

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి, విరాజ్ అశ్విన్ లీడ్ రోల్స్ లో సాయి రాజేష్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా బేబీ. ఎస్.కె.ఎన్ నిర్మించిన ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ అందించారు. జూలై 14న రిలీజైన ఈ సినిమా యూత్ ఆడియన్స్ కి బాగా ఎక్కేసింది. సినిమా రోజు రోజుకి వసూళ్లు అదరగొట్టేస్తున్నాయి. బేబీ సినిమా 50 కోట్ల గ్రాస్ కి దగ్గరగా ఉంది. ఎస్.కె.ఎన్ సినిమా 10 కోట్ల దాకా బడ్జెట్ అయినట్టు తెలుస్తుండగా సినిమాను 7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ చేశారు.

ఇక ఈ సినిమా ప్రధాన పాత్రల రెమ్యునరేషన్ గురించి న్యూస్ బయటకు వచ్చింది. సినిమాలో నటించినందుకు గాను ఆనంద్ దేవరకొండకు 80 లక్షల దాకా రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ సినిమా వైష్ణవి చైతన్యకు 30 లక్షల రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట. విరాజ్ అశ్విన్ కి కూడా 20 లక్షల దాకా పారితోషికం ఇచ్చారని తెలుస్తుంది. సినిమాకు బలం అనుకున్న ఈ మూడు పాత్రలకు 2 కోట్ల లోపే రెమ్యునరేషన్ ఇచ్చారని తెలుస్తుంది.

ఇక రీసెంట్ గా జరిగిన ఈవెంట్ లో బేబీ సినిమా ఒక షెడ్యూల్ పూర్తయ్యాక అక్కడ కొన్ని కారణాల వల్ల అదంతా వేస్ట్ అయ్యిందని.. మళ్లీ వేరే చోట సెట్ వేసి ఈ షూటింగ్ మొదలు పెట్టారని తెలుస్తుంది. సాయి రాజేష్ ఈ సినిమా కోసం రెండేళ్లుగా కష్టపడ్డారు. ఎస్.కె.ఎన్ సోలో నిర్మాతగా చేసిన బేబీ మంచి వసూళ్లతో ఫుల్ ఖుషిగా ఉన్నారు.

అంతకుముందు షార్ట్ ఫిలింస్ తో మెప్పించిన వైష్ణవి యూట్యూబ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. బేబీ సినిమా తొలి ప్రయత్నమే అయినా ఆమె తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసింది. న్యూ ఏజ్ లవ్ స్టోరీగా వచ్చిన బేబీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. యూత్ ఆడియన్స్ అంతా కూడా ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతున్నారు.

సాయి రాజేష్ అంతకుముందు హృదయ కాలేయం, కొబ్బరిమట్ట సినిమాలు చేశాడు. కలర్ ఫోటో సినిమాను నిర్మించింది కూడా సాయి రాజేష్. బేబీ కి ముందు సెటైరికల్ సినిమాలు చేసి సాయి రాజేష్ ఇక మీదట బేబీ లాంటి సినిమాలనే చేస్తానని అంటున్నారు. నిర్మాత ఎస్.కె.ఎన్ కూడా బేబీ లాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటానని అన్నారు.