Begin typing your search above and press return to search.

బేబీ.. మరో క్లైమాక్స్ కూడా రెడీగా..

అదేంటంటే, ఈ మూవీకి ముందుగా రెండు క్లైమాక్స్ లు అనుకున్నారట.

By:  Tupaki Desk   |   22 July 2023 2:40 PM GMT
బేబీ.. మరో క్లైమాక్స్ కూడా రెడీగా..
X

ప్రస్తుతం ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా బేబి మూవీ పేరే వినపడుతోంది. ఈ మూవీ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆనంద్ దేవ‌ర‌కొండ కి చాలా కాలం తర్వాత వచ్చిన హిట్ ఇది. అసలు ఆయన కెరీర్ లో బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు. ఈ మూవీలో వైష్ణ‌వి చైత‌న్య హీరోయిన్‌గా న‌టించింది. విరాజ్ మ‌రో కీల‌క పాత్ర‌లో న‌టించారు. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కించుకున్న`క‌ల‌ర్ ఫొటో` సినిమాకు క‌థ అందించ‌డ‌మే కాకుండా నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రించిన సాయి రాజేష్ నీలం ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఎస్‌కెఎన్ నిర్మించిన ఈ సినిమా ఇటీవల ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

మూవీ విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ముఖ్యంగా హీరోయిన్ నటకు ప్రశంసల వర్షం కురుస్తోంది. అసలు పెద్దగా గుర్తింపు లేని నటీనటులతో సినిమా తీసి ఊహించని హిట్ అందుకున్నారు. కాగా మూవీ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. కేవలం విడుదలైన వారం రోజుల్లోనే రూ.23కోట్లు రాబట్టింది అంటేనే ఈ మూవీ ఎంత క్లిక్ అయ్యిందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు.

అయితే ఈ మూవీ గురించి తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే, ఈ మూవీకి ముందుగా రెండు క్లైమాక్స్ లు అనుకున్నారట. ఈ రెండింటిలో ఏది ఫైనల్ చేయాలో మూవీ టీమ్ కి అర్థం కాలేదట. అందులో ఒకటి విషాదకరంగా ముగించాలని అనుకున్నారట. మరోటి ప్రస్తుతం మూవీలో ఉంచినట్లు గా హీరోయిన్ కి మరొకరితో పెళ్లి కావడం, హీరో మందు తాగుతూ మిగిలిపోవడం.

ఈ రెండింటిలో ఏది ఒకే చేయాలా అని ఆలోచించిన మేకర్స్ మారుతీ, బన్నీ వాస్, అల్లు అరవింద్ అభిప్రాయాలను అడిగారట. వారంతా ఆలోచించి, ప్రస్తుతం మూవీలో ఉన్న క్లైమాక్స్ ని ఒకే చేశారట. అందుకే దానినే ఫైనల్ చేశారు. లేదంటే, హీరోయిన్ కానీ, హీరోగా చనిపోయినట్లుగా క్లైమాక్స్ ఉండేదట.

ఇదిలా ఉండగా, ఈ మూవీ కి ఇప్పటి వరకు చాలా మంది ఫిదా అయ్యారు. అలా ఈ మూవీ చూపి ఇంప్రెస్ అయిన వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఉన్నారు. కంప్లీట్ గా ఓ మీటింగ్ పెట్టి మరీ, ఈ మూవీ టీమ్ పై ఆయన ప్రశంసలు కురిపించడం విశేషం.