Begin typing your search above and press return to search.

మన 'బేబీ' కోసం హిందీ ప్రొడ్యూసర్స్, స్టార్స్‌ పోటీ...!

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఒక నటి తన కూతురును బేబీ సినిమా లో నటింపజేసేందుకు గాను నిర్మాత ఎస్‌కేఎన్‌ తో చర్చలు జరిపిందని సమాచారం అందుతోంది.

By:  Tupaki Desk   |   24 Dec 2023 7:28 AM GMT
మన బేబీ కోసం హిందీ ప్రొడ్యూసర్స్, స్టార్స్‌ పోటీ...!
X

ఈ ఏడాది వచ్చిన మేటి చిత్రాల్లో బేబీ ఒకటి అనడంలో సందేహం లేదు. చిన్న సినిమాల్లో బాహుబలి రేంజ్ విజయం 'బేబీ' దక్కించుకుంది అంటూ సోషల్‌ మీడియాలో టాక్‌ వినిపించింది. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి, విరాజ్ ముఖ్య పాత్రల్లో నటించిన 'బేబీ' సినిమా దాదాపుగా వంద కోట్ల వసూళ్లు నమోదు చేసిందని బాక్సాఫీస్ వర్గాల సమాచారం.

ఓ డిఫరెంట్ లవ్ స్టోరీ తో సాగిన 'బేబీ' సినిమా కాన్సెప్ట్‌ యూనివర్శిల్‌ సబ్జెక్ట్‌ కావ్వడంతో ఇతర భాషల్లో ఈ సినిమాను రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే నిర్మాత ఎస్‌కేఎన్‌ బేబీ ని హిందీతో పాటు తమిళంలో కూడా రీమేక్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు.

హిందీలో బేబీ రీమేక్ గురించి సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. చాలా మంది నిర్మాతలు బేబీ రీమేక్ కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. పెద్ద బ్యానర్‌ తో కలిసి రీమేక్ చేయాలని ఎస్‌కేఎన్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు. పూర్తిగా రీమేక్ హక్కులు ఇవ్వకుండా హిందీ రీమేక్ లో కూడా నిర్మాణ భాగస్వామిగా ఉండాలి అనేది నిర్మాత ఎస్‌కేఎన్‌ వ్యూహంగా తెలుస్తోంది.

ఆ విషయంలోనే కాస్త ఆలస్యం అవుతుంది అంటూ సమాచారం అందుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు బేబీ ని సొంతంగా నిర్మించాలని భావిస్తున్నాయట. అంతే కాకుండా ప్రముఖ స్టార్స్‌ వారి పిల్లలను బేబీ రీమేక్ లో నటింపజేయాలని కూడా చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఒక నటి తన కూతురును బేబీ సినిమా లో నటింపజేసేందుకు గాను నిర్మాత ఎస్‌కేఎన్‌ తో చర్చలు జరిపిందని సమాచారం అందుతోంది. హీరోల పాత్రల కోసం కూడా స్టార్స్ ఆసక్తి చూపిస్తూ పోటీ పడుతున్నారు. కనుక బేబీ రీమేక్‌ ఓ రేంజ్‌ లో స్టార్ కాస్టింగ్‌ తో ఉండే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.

బేబీ సినిమా హిందీ మరియు తమిళ ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యే విధంగా ఉంటుంది. కనుక అక్కడ కూడా నిర్మాతగా వ్యవహరిస్తే భారీగా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది ఎస్‌కేఎస్ అభిప్రాయంగా తెలుస్తోంది. అందుకే రీమేక్‌ లో నిర్మాణ భాగస్వామిగా ఉంటాడట. హిందీ రీమేక్‌ మొదలు పెట్టి లేదా విడుదల చేసిన తర్వాత తమిళ రీమేక్ ను షురూ చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇటీవల నిర్మాత ఎస్‌కేఎన్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హిందీలో బేబీ రీమేక్ నిజమే అన్నట్లు క్లారిటీ ఇచ్చాడు. ప్రముఖ నిర్మాణ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లుగా ప్రకటించాడు. బేబీ హిందీ రీమేక్‌ కాస్త ఎక్కువ బడ్జెట్‌ తో ఉంటుంది అని కూడా నిర్మాత ఎస్‌కేఎన్‌ పేర్కొన్నాడు. మరి హిందీ రీమేక్‌ ను ఎస్‌కేఎన్‌ మొదలు పెట్టేది ఎప్పుడో చూడాలి.