Begin typing your search above and press return to search.

హిందీలో బేబీ అది వేరే లెవెల్..!

ఈ క్రమంలోనే లాస్ట్ ఇయర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బేబీ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నారని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   21 July 2024 3:15 AM GMT
హిందీలో బేబీ అది వేరే లెవెల్..!
X

తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమాలు కొన్ని ఈమధ్య వెంటనే వేరే భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ఎక్కువగా మన తెలుగు సినిమాల మీద బాలీవుడ్ మేకర్స్ కన్ను పడింది. స్టార్ సినిమాలన్నీ దాదాపు పాన్ ఇండియా రిలీజ్ అవుతుంటే ఇక్కడ తక్కువ లేదా మీడియం బడ్జెట్ తో తో సూపర్ హిట్ అయిన సినిమాలను హిందీలో డబ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే లాస్ట్ ఇయర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బేబీ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నారని తెలుస్తుంది.

ఐతే హిందీలో కూడా ఈ సినిమాను సాయి రాజేష్ డైరెక్ట్ చేస్తాడని చెబుతున్నారు. బేబీ సినిమా బాలీవుడ్ వెర్షన్ లో కొన్ని సీన్స్ మారే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా హీరోని హీరోయిన్ మోసం చేసే సీన్ ని అక్కడ ఇంకాస్త బో**ల్డ్ గా తెరకెక్కించే ఛాన్స్ ఉందని అంటున్నారు. బాలీవుడ్ లో మామూలుగానే ప్రతి సినిమాలో శృతిమించిన గ్లామర్ షో ఉంటుంది.

అందులోనూ బేబీ లాంటి సినిమా అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సూపర్ హిట్ సినిమా రీమేక్ చేస్తున్నారు సరే ఇందులో నటీనటులుగా ఎవరిని ఎంపిక చేస్తున్నారు అన్నది తెలియాల్సి ఉంది. బేబీ సినిమా తెలుగులో నిర్మించిన ఎస్.కె.ఎన్, గీతా ఆర్ట్స్ 2 నే బాలీవుడ్ లో కూడా నిర్మిస్తుంది. ఆఇతే ఇక్కడ కన్నా అక్కడ రొమాంటిక్ ఆడియన్స్ ఎక్కువ కాబట్టి హీరోయిన్ సీన్స్ ని మరింత ఘాటుగా రాసుకుంటున్నారని తెలుస్తుంది.

ఐతే ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాను రీమేక్ చేస్తే అదే రిజల్ట్ వస్తుందని చెప్పలేం. తెలుగు నుంచి రీమేక్ అయిన హిందీ సినిమాల్లో బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చిన ప్రతి సినిమా సక్సెస్ అయ్యింది. ఐతే బేబీ విషయంలో ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా లేదా అన్నది చూడాలి. బేబీ సినిమాకు మ్యూజిక్ ప్రాణంగా నిలిచింది. మరి హిందీ రీమేక్ కు ఎలాంటి సంగీతం అందిస్తారన్నది చూడాలి.

నాని నటించిన జెర్సీ సినిమాను తెలుగులో తీసిన గౌతం తిన్ననూరి హిందీలో రీమేక్ చేశాడు. సందీప్ వంగా కూడా అర్జున్ రెడ్డికి అక్కడ కబీర్ సింగ్ గా తీసి హిట్ కొట్టాడు. ఐతే మన కథలను మన దర్శకులే వెళ్లి రీమేక్ చేయడం వల్ల ఒరిజినాలిటీ మిస్ అవ్వట్లేదు. మరి అలానే బేబీకి కూడా అదే బలంగా మారే అవకాశం ఉంటుందేమో చూడాలి.