Begin typing your search above and press return to search.

పెరగనున్న బేబీ రన్ టైమ్.. మరికొన్ని మసాలా సీన్స్!

అయితే ఆ నాలుగు గంటల రన్ టైమ్ తప్పితే మరొక వెర్షన్ కట్ చేయడానికి వీలుపడని క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడ్డాయట.

By:  Tupaki Desk   |   3 Aug 2023 5:09 PM GMT
పెరగనున్న బేబీ రన్ టైమ్.. మరికొన్ని మసాలా సీన్స్!
X

ఇటీవల కాలంలో బేబీ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా కాదు. తక్కువ పెట్టుబడిలో నిర్మాత SKN కు భారీ స్థాయిలో ఈ సినిమాల లాభాలు తెచ్చిపెట్టింది. రిస్కు తీసుకుని సినిమా కోసం దాదాపు 12 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఇక సినిమా అయితే మొత్తంగా 55 నుంచి 60 కోట్ల స్థాయిలో అయితే లాభాలను అందించబోతోంది. ఇక ఈ సినిమా మొదట తెరపైకి తీసుకురావాలి అనుకున్నప్పుడు కేవలం రెండు గంటల 40 నిమిషాల నిడివితో చెప్పాలని అనుకున్నారు.

కానీ దర్శకుడు సాయి రాజేష్ మాత్రం ఆ విషయంలో కాస్త ఎక్కువగానే ఆలోచించి ఐదు గంటల 25 నిమిషాల ఫుటేజ్ ను తీసుకువచ్చాడు. ఇక దాన్ని ఎడిటింగ్ రూమ్ లోకి తీసుకు వచ్చిన తర్వాత చాలా ప్రయత్నాలు చేసిన అనంతరం నాలుగు గంటలకు వచ్చింది. అయితే ఆ నాలుగు గంటల రన్ టైమ్ తప్పితే మరొక వెర్షన్ కట్ చేయడానికి వీలుపడని క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడ్డాయట.

ఎలాంటి సీన్లు తీసేయాలో అర్థం కాక చాలా రోజులు తంటాలు పడినట్లుగా సాయి రాజేష్ తెలియజేశాడు. అయితే మొత్తానికి బన్నీ వాసు మారుతి SKN కూర్చుని సినిమాను మూడు గంటలు వచ్చేలా పర్ఫెక్ట్ వెర్షన్ ను కట్ చేయించారట. అయితే ఇప్పుడు సినిమాను మూడు గంటలు నిడివితో వచ్చినప్పటికీ కూడా ప్రేక్షకులు నెగటివ్ కామెంట్స్ పెద్దగా చేయలేదు.

అయితే ఇప్పుడు మరికొన్ని బోల్డ్ మసాలా సీన్స్ కూడా యాడ్ చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. సినిమాకు మొదట పర్ఫెక్ట్ రన్ టైమ్ 4 గంటలు రాగా ఇప్పుడు ఆ ముఖ్యమైన సీన్స్ ను జత చేయాలని అనుకుంటున్నారు. అందులో వైష్ణవి చైతన్య విరాజ్ అశ్విన్ మధ్యలో వచ్చే కొన్ని రొమాంటిక్ బోల్డ్ సీన్స్ కూడా జత చేయాలని అనుకుంటున్నారు.

అంతేకాకుండా ఆనంద్ దేవరకొండ మదర్ సెంటిమెంట్ కు సంబంధించిన మరికొన్ని సీన్స్ కూడా మిక్స్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా సినిమా కంటెంట్ కు సెట్ అయ్యే విధంగానే మరికొన్ని నిమిషాల పాటు ఈ సినిమా రన్ టైం పొడిగించే అవకాశం ఉందట. అయితే అలా సినిమా ధియేటర్లలో కాకుండా ఓటిటిలో విడుదల చేస్తే బాగుంటుంది అని అల్లు అరవింద్ సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అహ ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో 4 గంటల నిడివితో బేబీ సినిమాను స్ట్రీమింగ్ అయ్యేలా చేయాలి అని దర్శక నిర్మాతలకు ఆయన సూచనలు ఇచ్చారట. మరి ఈ విషయంలో సాయి రాజేష్ SKN ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.