Begin typing your search above and press return to search.

మంచి హీరోలు మోసపోతే.. హిట్టే!

మరోవైపు ట్రెండ్​తో సంబంధం లేకుండా కూడా అడపాదడపా సేమ్​ ఫార్ములాతో వచ్చే కొన్ని చిత్రాలు కూడా మంచి హిట్​ను అందుకుంటుంటాయి. ఇప్పుడు థియేటర్లలో సక్సెస్​ఫుల్​గా రన్​ అవుతున్న 'బేబీ' మూవీ కూడా అంతే.

By:  Tupaki Desk   |   18 July 2023 6:56 AM GMT
మంచి హీరోలు మోసపోతే.. హిట్టే!
X

ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ కనిపిస్తుంటుంది. ఆ సయయంలో ఆయా జానర్​ సినిమాలు బాగా క్లిక్ అవుతుంటాయి. ఆడియెన్స్​ను థియేటర్లకు రప్పిస్తుంటాయి. మరోవైపు ట్రెండ్​తో సంబంధం లేకుండా కూడా అడపాదడపా సేమ్​ ఫార్ములాతో వచ్చే కొన్ని చిత్రాలు కూడా మంచి హిట్​ను అందుకుంటుంటాయి. ఇప్పుడు థియేటర్లలో సక్సెస్​ఫుల్​గా రన్​ అవుతున్న 'బేబీ' మూవీ కూడా అంతే.

ట్రయాంగిల్ లవ్​స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో హీరోయినే మెయిన్​ ఫోకస్​. ప్రేమను చూపిస్తూనే.. బ్యాడ్​ టచ్ ఉన్న నెగటివ్ అండ్ బోల్డ్​​ షేడ్స్​లో చూపించారు. అంటే హీరోను ఊహించని విధంగా మోసం చేసే పాత్రలో చూపించారు. ఈ రోల్​ సినిమాలో బాగా పండింది. యూత్​ ఆడియెన్స్​ను బాగా మెప్పించింది. బాక్సాఫీస్​ వద్ద ఇప్పుడీ చిత్రం మంచి వసూళ్లను అందుకుంటోంది.

అయితే గతంలో ఇలాంటి ఫార్ములాతో వచ్చిన చాలా సినిమాలు కూడా బాగానే ఆడాయి. అప్పుడెప్పుడో వచ్చిన తమిళ డబ్బింగ్ మూవీ 'మన్మథ'తో మొదలై.. ఇప్పటికీ నెగటివ్ అండ్ బోల్డ్​ హీరోయిన్​​ ఫార్మూలా కొనసాగుతూనే ఉంది. ఇవన్నీ ఆడియెన్స్​ అటెన్షన్​ను బాగా క్యాచ్ చేశాయి. అందుకే దర్శకనిర్మాతలు అప్పుడప్పుడు దీనిని కొనసాగిస్తూ.. దానికి ఇంకాస్త తమ టాలెంట్​ను జోడించి ప్రేక్షకల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా యూత్​ ఆడియెన్స్​ పల్స్​ను బాగా పట్టుకుంటున్నారు. బాక్సాఫీస్​ వద్ద క్యాష్​ చేసుకుంటున్నారు.

అప్పట్లో యూత్​ను ఆడియెన్స్​ను విపరీతంగా ఆకట్టుకున్న 'కుమారి 21 ఎఫ్'​లోనూ హీరోయిన్​ హెబ్బా పటేల్​ను కాస్త హై కల్చర్​ ఉన్న బోల్డ్​ అండ్ నెగటివ్​ షేడ్స్​లో చూపించారు. ఆ పాత్ర బాగా కనెక్ట్ అయింది. అయితే ఇందులో ఆమెది హీరోను మోసం చేసే పాత్ర కాదు. కానీ ఆ తర్వాత వచ్చిన 'ఆర్​ఎక్స్​ 100'(పాయల్ రాజ్​పుత్​), 'డీజే టిల్లు'లో(నేహాశెట్టి) హీరోయిన్స్​ను పక్కాగా హీరోలను ప్రేమలో దించుతూనే మోసం చేసే పాత్రలో బాగా చూపించారు. వీటన్నింటిలో హీరోయిన్స్​ బోల్డ్​ అండ్ నెగటివ్ షేడ్స్​లో చూపించారు. వాస్తవానికి ఈ సినిమాల కథలన్నీ ఒకదానికి ఇంకోటి సంబంధం ఉండదు. కానీ మెయిన్ థీమ్ ఒకటే. లవ్​ జానర్​లో నెగటివ్ అండ్ బోల్డ్​​ హీరోయిన్​ ఫార్మూలతో వచ్చినవ్వే. ఈ చిత్రాలన్నింటిలో హీరో.. హీరోయిన్​ను పీకల్లోతూగా వెళ్లి ప్రేమిస్తే.. కథానాయిక మాత్రం మొదటి నుంచి అతడి కోసమే ఉంటున్నట్టు నటించి చివరికి తన అసలు రూపాన్ని బయటపెడుతుంది.

అయితే ఈ కాన్సెప్ట్​తో వచ్చిన అన్నీ చిత్రాలు హిట్​ అయ్యాయి అని కూడా చెప్పలేం. ఎందుకంటే కథ చెప్పే విధానం చూపించే విధానం, నటీనటుల పెర్​ఫార్మెన్స్​, పాటలు, సంగీతం, సినిమా మార్కెటింగ్.. ఇలా​ అన్నీ కలిసొస్తేనే సినిమా బ్లాక్ బాస్టర్​ హిట్ అవుతుంది. అప్పుడే వసూళ్ల వర్షం కురిపిస్తుంది. పైన చెప్పుకున్న సినిమాల్లో ఈ అంశాలన్నీ ప్రేక్షకుల్ని బాగా మెప్పించాయి. ముఖ్యంగా మ్యూజికల్​గా సెన్సేషనల్​ సృష్టించాయి.