Begin typing your search above and press return to search.

బేబీ అక్కడ మరో లవ్ టుడే అవుతుందా..?

అయితే విఘ్నేష్ శివన్ కామెంట్ తో బేబీ సినిమా గురించి కోలీవుడ్ లో స్పెషల్ డిస్కషన్స్ చేస్తున్నారు. బేబీ సినిమా తమిళంలో రీమేక్ అవుతుందా

By:  Tupaki Desk   |   27 July 2023 10:34 AM GMT
బేబీ అక్కడ మరో లవ్ టుడే అవుతుందా..?
X

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి నటించిన బేబీ సినిమా ఎస్.కె.ఎన్ నిర్మించగా విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ అందించారు. జూలై 14న రిలీజైన ఈ సినిమా భారీ వసూళ్లతో అదర్గొట్టేస్తుంది. స్కూల్ ఏజ్ లో ఒక అమ్మాయి హీరోని ప్రేమించడం.. ఆ అమ్మాయి ప్రేమను తెలుసుకున్న హీరో తిరిగి ఆమెను ప్రేమించడం అయితే ఆ ప్రేమించిన వ్యక్తి స్కూల్ లో ఫెయిల్ అవడంతో ఆటో డ్రైవర్ గా మారుతాడు.

ఆమె ఇంజినీరింగ్ కాలేజ్ లో జాయిన్ అవుతుంది. అక్కడ హీరోయిన్ కి బోయ్ బెస్టీ ఒకడు పరిచయం అవుతాడు. ఈ ఇద్దరి మధ్య ఆ అమ్మాయి ఎలాంటి రిలేషన్ మెయింటైన్ చేసింది అన్నది సినిమా కథ.

ఎన్ని కాలాలైనా సరే ప్రేమకథలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటూనే వస్తుంది. కొద్దిగా కొత్తగా చెప్పగలిగితే చాలు సినిమా సూపర్ హిట్ కొట్టినట్టే లెక్క. టాలీవుడ్ సూపర్ హిట్ ఫార్ములా అంటే ఒక సూపర్ లవ్ స్టోరీ సినిమానే అని మరోసారి ప్రూవ్ చేశారు.

బేబీ సినిమా రిలీజై మూడు వారాలు అవుతుండగా ఈ సినిమా ఇప్పటికే 70 కోట్ల పైన గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా సక్సెస్ ని చిత్రయూనిట్ సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు.

అయితే బేబీ సినిమా లవ్ స్టోరీ కాబట్టి.. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్.. ఈ కథ ఏ భాషలో తీసినా హిట్ అవుతుంది. బేబీ సినిమా చూసిన తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ సినిమా యూనిట్ ని ప్రశంసించారు.

అయితే విఘ్నేష్ శివన్ కామెంట్ తో బేబీ సినిమా గురించి కోలీవుడ్ లో స్పెషల్ డిస్కషన్స్ చేస్తున్నారు. బేబీ సినిమా తమిళంలో రీమేక్ అవుతుందా.. లేదా అక్కడ డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తారా అన్న టాక్ నడుస్తుంది.

రీసెంట్ గా తమిళంలో సూపర్ హిట్టైన లవ్ టుడే సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు మన బేబీ కూడా కోలీవుడ్ ఆడియన్స్ ని మెప్పిస్తుందని చెప్పొచ్చు. బేబీ సినిమా తమిళ్ లో డబ్ చేసి రిలీజ్ చేసినా సరే అక్కడ ఆడియన్స్ కు ఇది బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. మరి మన బేబీ అక్కడ మరో లవ్ టుడే సినిమా అవుతుందా ఈ సినిమా అక్కడ రీమేక్ అవుతుందా లేదా డబ్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.