Begin typing your search above and press return to search.

బేబీ.. 100 కోట్లకు ఇంకా ఎంత దూరమంటే?

ఇక ఈ సినిమా ఇప్పుడు 5వ వారంలో కూడా డీసెంట్ కలెక్షన్స్ తో ముందుకు సాగుతోంది. ఈ తరుణంలో సినిమా కలెక్షన్స్ 91 కోట్లు దాటేశాయి.

By:  Tupaki Desk   |   15 Aug 2023 9:07 AM GMT
బేబీ.. 100 కోట్లకు ఇంకా ఎంత దూరమంటే?
X

పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిన్న సినిమా బేబీ ఊహించని స్థాయిలో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. అసలు ఈ సినిమా ఏదో కొన్ని రోజులు ఆడేసి డబుల్ ప్రాఫిట్ తో వెళ్ళిపోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ సినిమా ఊహించని స్థాయిలో ప్రతివారం ఏదో ఒక రికార్డును క్రియేట్ చేస్తూనే ఉంది.

ఇప్పుడు ఐదవ వారంలో కూడా డీసెంట్ కలెక్షన్స్ అందుకుంటూ మరొక రికార్డుకు అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన బేబీ సినిమా యువతకు చాలా బాగా కనెక్ట్ అయింది. ఇంతకుముందు వరకు పెద్దగా సక్సెస్ లేని ఆనంద్ దేవరకొండ ఈ సినిమాతో ఊహించని స్థాయిలోనే సక్సెస్ అయితే సొంతం చేసుకున్నాడు.

ఇక హీరోయిన్ వైష్ణవి చైతన్య కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకునే విధంగా ఈ సినిమా మర్చిపోలేని విజయాన్ని ఇచ్చింది. ఇప్పటికే 50 కోట్ల కలెక్షన్స్ ను చాలా వేగంగా అందుకున్న చిన్న సినిమాల్లో మొదటి సినిమాగా బేబీ రికార్డును క్రియేట్ చేసింది. పోటీగా ఇతర సినిమాలు ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా కలెక్షన్స్ పై పెద్దగా ప్రభావం చూపలేదు.

మొదటి మూడు వారాలు కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తోనే చాలా ఏరియాలలో బేబీ సందడి చేసింది. ఇక పెట్టిన పెట్టుబడికి నిర్మాత ఎస్కేన్ భారీ స్థాయిలోనే లాభాలను అందుకుంటూ ఉన్నాడు. కంటెంట్ జనాలకు కనెక్ట్ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ ఏ స్థాయిలో ఉంటాయో బేబీ సినిమా ఉదాహరణగా నిలిచింది.

ఇక ఈ సినిమా ఇప్పుడు 5వ వారంలో కూడా డీసెంట్ కలెక్షన్స్ తో ముందుకు సాగుతోంది. ఈ తరుణంలో సినిమా కలెక్షన్స్ 91 కోట్లు దాటేశాయి. ఇక 9 కోట్లు వస్తే 100 కోట్ల మార్కును సాధిస్తుంది. ఇక నెంబర్ ను అందుకుంటుందా లేదా అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇలానే కొనసాగితే మాత్రం తప్పకుండా మరి కొన్ని రోజుల్లోనే 100 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ సినిమా సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంది. ఆగస్టు 15వ రోజు కూడా హాలిడే కావడంతో సినిమాకు మంచి కలెక్షన్స్ అయితే అందుతున్నాయి. ఇక ఈ వీకెండ్ వరకు కూడా మినిమం కలెక్షన్స్ అందుకుంటే సినిమా అతి పెద్ద టార్గెట్ ను అందుకున్నట్లే. మరి బేబీ ఆ స్థాయిలో ముందుకు కొనసాగుతుందో లేదో చూడాలి.