Begin typing your search above and press return to search.

'బేబీ' కనిపించకపోవడానికి కారణం అదన్నమాట!

అయినా కూడా ఇప్పటి వరకు బేబీ తమిళ్ వర్షన్ ని స్ట్రీమింగ్‌ చేయక పోవడంతో అంతా కూడా అసలు ఏం జరుగుతుంది అన్నట్లుగా చర్చించుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   4 Oct 2023 2:45 AM GMT
బేబీ కనిపించకపోవడానికి కారణం అదన్నమాట!
X

రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా యూట్యూబర్‌ వైష్ణవి చైతన్య హీరోయిన్‌ గా సాయి రాజేష్‌ దర్శకత్వంలో ఎన్‌ కే ఎన్‌ నిర్మాణంలో వచ్చిన 'బేబీ' మూవీ సెన్షేషనల్ సక్సెస్‌ ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. దాదాపు వంద కోట్ల వసూళ్లు నమోదు చేసిన బేబీ ఓటీటీ లో కూడా సందడి చేసి చరిత్ర సృష్టించింది.

ఈ మధ్య కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని సినిమాలు కూడా ఓటీటీ లో స్ట్రీమింగ్ అయిన సమయంలో ఇతర భాషల్లో కూడా అందుబాటులో ఉంటున్నాయి. 'బేబీ' సినిమా ను ప్రముఖ ఓటీటీ ఆహా స్ట్రీమింగ్ చేసిన విషయం తెల్సిందే. ఆహా వారిదే తమిళ్ ఓటీటీ కూడా ఉంది. అక్కడ కూడా బేబీ ని స్ట్రీమింగ్‌ చేస్తారని అంతా భావించారు.

తెలుగు వర్షన్‌ స్ట్రీమింగ్‌ ప్రారంభం అయ్యి వారాలు దాటి నెలలు కూడా కావస్తుంది. అయినా కూడా ఇప్పటి వరకు బేబీ తమిళ్ వర్షన్ ని స్ట్రీమింగ్‌ చేయక పోవడంతో అంతా కూడా అసలు ఏం జరుగుతుంది అన్నట్లుగా చర్చించుకుంటున్నారు. మీడియా ద్వారా బేబీ గురించి తెలుసుకున్న తమిళ తంబీలు స్ట్రీమింగ్ కోసం వెయిట్‌ చేస్తున్నారు.

బేబీ సినిమాను స్ట్రీమింగ్‌ చేయక పోవడంకు కారణం.. తమిళ్‌ ఆహా ఓటీటీ లో బేబీ కనిపించక పోవడంకు కారణం మరో బేబీ రాబోతుందట. అంటే తమిళ్ లో బేబీ ని రీమేక్ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఒరిజినల్ వర్షన్‌ దర్శకుడు సాయి రాజేష్ దర్శకత్వంలో తమిళ్‌ లో బేబీ రీమేక్ అవ్వబోతుంది.

తమిళ్‌ ఇండస్ట్రీకి చెందిన నటీ నటులతో బేబీ ని రీమేక్ చేసేందుకు గాను చర్చలు జరుగుతున్నాయట. తమిళ్‌ బేబీ గా కూడా వైష్ణవి చైతన్య ని తీసుకుంటే బాగుంటుందని మొదట భావించినా కూడా.. చివరకు తమిళ్ అమ్మాయినే తీసుకోవాలని నిర్ణయానికి వచ్చారట. తమిళ్ బేబీ గురించి త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓటీటీ లో చూడకున్నా డైరెక్ట్‌ గా థియేటర్లలో బేబీని తమిళ్‌ తంబీ లు చూడబోతున్నారు.