బచ్చలమల్లి… నిజమైన కథే..
అల్లరి నరేష్ కామెడీ కథలతో హీరోగా కెరియర్ స్టార్ట్ చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు.
By: Tupaki Desk | 29 Nov 2024 8:18 AM GMTఅల్లరి నరేష్ కామెడీ కథలతో హీరోగా కెరియర్ స్టార్ట్ చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు. అయితే ‘నాంది’ సినిమా తర్వాత నరేష్ స్టోరీ సెలక్షన్స్ కంప్లీట్ గా మారిపోయింది. కామెడీని పక్కన పెట్టి డిఫరెంట్ కథలని ఎంచుకుంటున్నాడు. అలా వచ్చినవే ‘ఇట్లు మారేడుమల్లి ప్రజానీకం’, ‘ఉగ్రం’ సినిమాలు. అయితే ‘ఉగ్రం’ మూవీ చెప్పుకోదగ్గ స్థాయిలో మెప్పించలేదు.
దీంతో కొంత గ్యాప్ తీసుకొని ‘బచ్చల మల్లి’ అనే సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లి కంప్లీట్ చేశాడు. ‘సోలో బ్రతుకే సో బెటరు’ ఫేమ్ సుబ్బు దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా ఈ సినిమాని నిర్మించారు. తాజాగా ఈ మూవీ టీజర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని థియేటర్స్ లోకి తీసుకొని రావాలని అనుకుంటున్నారు. తాజాగా రిలీజ్ అయిన టీజర్ ని మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమా ఓ రౌడీ షీటర్ రియల్ లైఫ్ స్టోరీతో తెరకెక్కినట్లు తెలుస్తోంది. తునికి చెందిన బచ్చల మల్లి అనే రౌడీ కథతోనే ఈ సినిమాని సుబ్బు చేశారు. ఈ విషయంపై గతంలోనే క్లారిటీ వచ్చింది. తాజాగా టీజర్ రిలీజ్ ఈవెంట్ లో అల్లరి నరేష్ ఈ విషయాన్ని మరోసారి ప్రస్తావించారు. ఈ స్టోరీని నిజమైన రౌడీ షీటర్ కథతోనే చేస్తున్నారంట కదా అతనిని కలిసారా… మీకు ఎలా అనిపించింది అని జర్నలిస్ట్ నరేష్ ని ప్రశ్నించారు.
కలవడం జరిగింది. ఇది నా కథే. నా కథే వీళ్ళు తీస్తున్నారు. నేనే పర్మిషన్ ఇచ్చాను అని అందరితో చెబుతున్నాడు. అతని మాటల్లోనే నిజాయితీ, ఇన్నోసెన్స్ కనిపించింది. ఇప్పటికి ఆ పొగరు కూడా ఉంది. దీనికి ఎంఓసి కూడా ఇచ్చారు అని అల్లరి నరేష్ చెప్పారు. అందుకే టైటిల్ కూడా అతని పేరునే పెట్టినట్లు క్లారిటీ ఇచ్చారు. 1990లో తుని ప్రాంతంలో పేరు మోసిన దొంగ, రౌడీ షీటర్ గా బచ్చలమల్లి ఉండేవాడు.
అతని లైఫ్ లో జరిగిన సంఘటనలతోనే ఈ సినిమాని డైరెక్టర్ సుబ్బు తెరపై ఆవిష్కరించాడంట. అలాగే ఓ సామాజిక అంశాన్ని కూడా ఈ కథలో చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ‘హనుమాన్’ ఫేమ్ అమృత నాయర్ హీరోయిన్ గా నటించింది. రావు రమేష్ పోలీస్ ఆఫీసర్ గా కీలక పాత్రలో నటించారు. అల్లరి నరేష్ కెరియర్ లో ఫస్ట్ టైం రియలిస్టిక్ స్టోరీలో నటించాడు. ఈ మూవీ అతనికి ఎలాంటి సక్సెస్ ఇస్తుందనేది వేచి చూడాలి.