Begin typing your search above and press return to search.

2024లో బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీ ఇదే

బ‌డే మియాన్ చోటే మియాన్ బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫెయిల‌య్యాక ఈ సినిమా ద‌ర్శ‌క నిర్మాత‌ల మ‌ధ్య వివాదం తారా స్థాయికి చేరుకుంది.

By:  Tupaki Desk   |   31 Dec 2024 4:10 AM GMT
2024లో బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీ ఇదే
X

2024లో చివ‌రి రోజు .. 2025కి ఘ‌న స్వాగ‌తం ప‌లుకుతూ యూత్ ఉత్సాహంగా సెల‌బ్రేష‌న్స్ మూడ్ లో ఉన్నారు. ఈ ఏడాది సినిమా రంగంపై స‌మీక్ష‌లు వెబ్ లో దూసుకెళుతున్నాయి. అయితే ఏడాది ముగింపును ప‌రిశీలించాక‌.. 2024లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీ ఏది? అన్న‌ది విశ్లేషిస్తే.. దానికి స‌మాధానం ఇక్క‌డ ఉంది.

2024లో అతిపెద్ద ఫ్లాప్ మూవీ బాలీవుడ్ నుంచి వ‌చ్చింది. ఈ సినిమా కార‌ణంగా పంపిణీదారుల‌కు ఏకంగా 250 కోట్ల న‌ష్టాలొచ్చాయి. ఇందులో ఇద్దరు సూపర్ స్టార్లు నటించినా వారి ఇమేజ్ కూడా కాపాడ‌లేక‌పోయింది. ఇది సింగం ఎగైన్ .. మైదాన్.. బేబీ జాన్ లాంటి ఫ్లాపుల కంటే, ఏడాదిలో విడుద‌లైన బిగ్గెస్ట్ ఫ్లాప్ గా రికార్డుల్లో నిలిచింది. దాదాపు 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ 'బడే మియాన్ చోటే మియాన్' దారుణ ఫ‌లితాన్ని అందుకుంది.

ఇందులో అక్షయ్ కుమార్- టైగర్ ష్రాఫ్ లాంటి పెద్ద సూప‌ర్‌స్టార్లు న‌టించారు. ఆ ఇద్ద‌రూ యాక్ష‌న్ స్టార్లుగా బాలీవుడ్ లో హ‌వా సాగిస్తున్నా.. ఎందుక‌నో 'బ‌డే మియాన్ చోటే మియాన్' విష‌యంలో ఇది వ‌ర్క‌వుట్ కాలేదు. ఆస‌క్తిక‌రంగా ఈ చిత్రంలో సౌత్ సూప‌ర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన విలన్‌గా కనిపించారు. మానుషి చిల్లర్, అలయ ఎఫ్ లాంటి అందాల భామ‌లు క‌థానాయిక‌లుగా న‌టించారు. సోనాక్షి సిన్హా కూడా ప్రత్యేక పాత్రలో కనిపించారు.

కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌రైంది. భారతదేశంలో కేవలం 66 కోట్ల రూపాయల నికర వసూళ్లను సాధించగా, ప్రపంచవ్యాప్తంగా 102 కోట్ల రూపాయలను మాత్ర‌మే వసూలు చేసింది. చివరికి ఈ సినిమా 250 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చిందని బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషించింది. 2023లో 'ఆదిపురుష్' చిత్రం ఇంత పెద్ద న‌ష్టాన్ని మిగిల్చింద‌ని ప్ర‌చార‌మైంది. ఆ త‌ర్వాత 2024లో బిగ్గెస్ట్ ఫ్లాప్ ఇదేన‌ని చ‌ర్చ సాగుతోంది.

ద‌ర్శ‌క‌నిర్మాత‌ల మ‌ధ్య బిగ్ ఫైట్:

బ‌డే మియాన్ చోటే మియాన్ బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫెయిల‌య్యాక ఈ సినిమా ద‌ర్శ‌క నిర్మాత‌ల మ‌ధ్య వివాదం తారా స్థాయికి చేరుకుంది. నిర్మాత వాషు భగ్నానీ తనను మోసం చేసి తన డబ్బును స్వాహా చేసినందుకు దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్‌పై క్రిమినల్ కుట్ర, ఫోర్జరీ కేసు పెట్టారు. ప్ర‌స్తుతం ఈ కేసు కోర్టుల ప‌రిధిలో ఉంది.

బ‌డే మియాన్ చోటే మియాన్ జూన్ 6 నుండి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఈ చిత్రం స్ట్రీమింగ్ విడుదల తర్వాత కూడా విమర్శలను ఎదుర్కొంది. బాలీవుడ్ సినిమాల‌కు బాగా క‌లిసొచ్చే పండ‌గ రోజు (ఏప్రిల్ 11న ఈద్ సందర్భంగా) విడుదలైనా భార‌త‌దేశంలోనే అతిపెద్ద డిజాస్ట‌ర్ల‌లో ఒక‌టిగా ఈ చిత్రం రికార్డుల‌కెక్కింది.