Begin typing your search above and press return to search.

టాక్ సూప‌ర్.. కానీ క‌లెక్ష‌న్లేవీ?

అందులో ఒక‌టి అక్ష‌య్ కుమార్, టైగ‌ర్ ష్రాఫ్ హీరోలుగా న‌టించిన బ‌డేమియా చోటేమియా కాగా.. ఇంకోటి అజ‌య్ దేవ‌గ‌ణ్ లీడ్ రోల్ చేసిన మైదాన్.

By:  Tupaki Desk   |   13 April 2024 1:30 AM GMT
టాక్ సూప‌ర్.. కానీ క‌లెక్ష‌న్లేవీ?
X

రంజాన్ వీకెండ్ అంటే బాలీవుడ్ నుంచి ఒక్క‌టైనా భారీ చిత్రం బ‌రిలో ఉండాల్సిందే. మామూలుగా స‌ల్మాన్ ఖాన్ సినిమాలు ఆ సీజ‌న్లో రిలీజ‌వుతుంటాయి. కానీ ఈసారి ఖాన్ బ‌రిలో లేడు. కానీ ఈద్‌కు రెండు భారీ బాలీవుడ్ చిత్రాలు థియేట‌ర్ల‌లోకి దిగాయి. అందులో ఒక‌టి అక్ష‌య్ కుమార్, టైగ‌ర్ ష్రాఫ్ హీరోలుగా న‌టించిన బ‌డేమియా చోటేమియా కాగా.. ఇంకోటి అజ‌య్ దేవ‌గ‌ణ్ లీడ్ రోల్ చేసిన మైదాన్. ఇందులో బ‌డేమియా చోటేమియా సినిమాపై ముందు నుంచే నెగెటివిటీ ఉంది. అందుకు త‌గ్గ‌ట్లే టాక్ కూడా బాలేదు. దీంతో క‌లెక్ష‌న్ల మీద గ‌ట్టిగానే ప్ర‌భావం ప‌డుతోంది. ఇది డిజాస్ట‌ర్ అని తొలి రోజే తేలిపోయింది. వీకెండ్ త‌ర్వాత సినిమా నిల‌బ‌డ‌డం కష్ట‌మే. ఇక మైదాన్ విష‌యానికి వ‌స్తే ఈ సినిమాకు చాలా మంచి టాక్ వ‌చ్చింది. రివ్యూలు కూడా బాగున్నాయి.

చూసిన వాళ్లంతా మైదాన్ సూప‌ర్ అంటున్నారు. క్రిటిక్స్ అంద‌రూ 3, అంత‌కంటే ఎక్కువ రేటింగ్సే ఇచ్చారు. కానీ వ‌సూళ్లు చూస్తే చాలా సాధార‌ణంగా ఉన్నాయి. బాలీవుడ్లో అజ‌య్ దేవ‌గ‌ణ్ స్థాయి హీరో సినిమా, పైగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే 20 కోట్ల‌కు త‌క్కువ కాకుండా తొలి రోజు వ‌సూళ్లు రావాలి. కానీ మైదాన్‌కు తొలి రోజు వ‌ర‌ల్డ్ వైడ్ ప‌ది కోట్ల‌కు అటు ఇటుగా వ‌సూళ్లు వ‌చ్చాయంతే. ఇండియాలో 7 కోట్ల‌కు కాస్త ఎక్కువ వ‌సూళ్ల‌తో స‌రిపెట్టుకుంది మైదాన్. ఈ సినిమా రేంజికి, వ‌చ్చిన టాక్‌కు ఈ వ‌సూళ్లు చాలా త‌క్కువ‌. మంచి సినిమా అని పేరు తెచ్చుకున్నా జ‌నాల‌ను థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌లేక‌పోవ‌డం బాధాక‌రం. వీకెండ్లో అయినా సినిమా పుంజుకుంటుందేమో అని చూస్తున్నారు. ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డం కోసం వ‌న్ ప్ల‌స్ వ‌న్ టికెట్ ఆఫ‌ర్ కూడా ప్ర‌వేశ‌పెట్టింది టీం. మ‌రి ఇక్క‌డి నుంచైనా సినిమా పుంజుకుంటుందేమో చూడాలి.