BMCM సత్తా 1100 కోట్లు రాసిపెట్టుకోండి!
ఈ ప్రకటన నేరుగా నిర్మాతలు వాసు భగ్నానీ- జాకీ భగ్నానీ జనాల్లోకి వదిలారు. దీంతో ఇప్పుడీ స్టెట్ మెంట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
By: Tupaki Desk | 4 April 2024 5:58 AM GMTఅక్షయ్ కుమార్-టైగర్ ష్రాఫ్ హీరోలుగా అలీ అబ్బాస్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'బడేమియాన్ చోటేమియాన్' పై ఎలాంటి అంచనాలున్నాయో చెప్పాల్సిన పనిలేదు. అన్ని పనులు పూర్తిచేసుకుని ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో సినిమాపై ఆద్యంతం నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది. రొటీన్ కంటెంట్ అనే విమర్శలు వెల్లుబిక్కిన సమయం ఇది. సరిగ్గా ఇదే సమయంలో చిత్ర యూనిట్ రివర్స్ యాంగిల్ లో ప్రచారం మొదలుపెట్టింది. తమ సినిమా ఏకంగా రిలీజ్ అనంతరం వరల్డ్ వైడ్ గా 1100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధిస్తుందని సంచలన ప్రకటన జారీ చేసారు.
ఈ ప్రకటన నేరుగా నిర్మాతలు వాసు భగ్నానీ- జాకీ భగ్నానీ జనాల్లోకి వదిలారు. దీంతో ఇప్పుడీ స్టెట్ మెంట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. సినిమాపై ఘోరమైన నెగిటివ్ బజ్ ఉంటే నిర్మాతలు ఇలాంటి స్టేట్ మెంట్లతో పైకి లేపాలని చూస్తున్నారా? అంటూ ఓ నెటి జనుడు ప్రశ్నించాడు. ఒకవేళ నిర్మాతల గెస్సింగ్ కరెక్ట్ అయితే ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన యానిమల్..పటాన్..జవాన్ బాక్సాఫీస్ రికార్డులు చెరిగిపోయినట్లే.
'యానిమల్' 900 కోట్లు -'పఠాన్' 1050 కోట్లు- 'జవాన్'- 1150 కోట్లు వసూళ్లు చేసిన సంగతి తెలిసిందే. జవాన్ బాలీవుడ్‌లో రెండవ అతిపెద్ద గ్రాసర్‌గా నిలిచింది. ఆ రికార్డును తిరిగిరాసే సత్తా తమదే అంటున్న వైఖరి కనిపిస్తుంది నిర్మాత మాటల్లో. అయితే ఓసారి ఆ హీరోల గ్రౌండ్ రియాల్టీ చూస్తే షాక్ అవ్వడం ఖాయం. అక్షయ్ కుమార్ కి కొంత కాలంగా సరైన విజాయాలే లేవు. చేసిన ప్రతీ సినిమా తీవ్ర నిరాశనే మిగిల్చింది.
చివరికి ప్రేక్షకుల్ని సినిమా చూడండి అని కోరుకునే స్థాయికి ఖిలాడీ పడిపోయాడు. ఆయన చివరి సినిమా 'మిషన్ రాణిగంజ్' 50 కోట్ల వసూళ్లనే అతికష్టం మీద సాధించింది. అలాగే టైగర్ ష్రాప్ మంచి కటౌట్ అయినా రేసులో కాస్త వెనుకబడ్డాడు. టైగర్ ష్రాఫ్ చివరి చిత్రం 'గణపత్' ప్రపంచవ్యాప్తంగా 20 కోట్లు వసూళ్లను మాత్రమే సాధించింది. అలాంటి స్టార్లు ఇద్దరు ఇప్పుడు ఏకంగా 1100 కోట్లు వసూళ్తు తెస్తారని నిర్మాతలు ధీమా వ్యక్తం చేయడం ఆశ్చర్యకరం. ట్రేడ్ నిపుణుల అంచాన ప్రకారం బీఎమ్ సీఎమ్ ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని భావిస్తున్నారు. అది కూడా సానుకూల మౌత్ టాక్ వస్తే. లేదంటే అంతకు అంతకు వసూళ్లు డ్రాప్ అవ్వకతప్పదని అంతే దీమాగా ఉన్నారు. మాటలు కోటలు దాటడం అంటే ఇదేనా అనిపిస్తుంది.