స్టార్ హీరోల మల్టీస్టారర్.. పరువు పోయింది భయ్యా!
స్టార్ హీరో సినిమా వస్తుంది అంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో సందడి మామూలుగా ఉండదు
By: Tupaki Desk | 8 April 2024 11:30 PM GMTస్టార్ హీరో సినిమా వస్తుంది అంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో సందడి మామూలుగా ఉండదు. ఇక మల్టీ స్టారర్ సినిమా అంటే ఏ రేంజ్ లో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం పరిస్థితి చాలా విభిన్నంగా, దారుణంగా ఉంది.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ లు నటించిన బడే మియా చోటే మియా సినిమా రంజాన్ సందర్భంగా ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అడ్వాన్స్ బుకింగ్ విషయంలో అసంతృప్తి నేపథ్యంలో ఒక రోజు ఆలస్యంగా సినిమాను విడుదల చేయబోతున్నారట.
ట్రైలర్ విడుదల తర్వాత ఈ సినిమాపై ఉన్న అంచనాలు పెరగాల్సింది తగ్గాయి అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ సినిమా ట్రైలర్ కి విపరీతమైన నెగటివ్ ట్రోల్స్ వచ్చాయి. ఇలాంటి కాన్సెప్ట్ తో ఇప్పటి వరకు హిందీలో వందల సినిమాలు వచ్చాయి.. మళ్లీ ఇలాంటి సినిమానే మీరు తీశారా అన్నట్లుగా కామెంట్స్ వచ్చాయి.
బడేమియా చోటే మియా సినిమా ట్రైలర్ లో విలక్షన నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర విషయంలో కూడా విమర్శలు వచ్చాయి. మొత్తానికి ట్రైలర్ తో సినిమాకు వచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ కారణంగా దారుణమైన అడ్వాన్స్ బుకింగ్ నడుస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్ ను చూస్తే పరువు పోయింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
సినిమా విడుదల తర్వాత ఏమైనా పరిస్థితి మారుతుందేమో అని మేకర్స్ తమ ప్రయత్నాలు తాము చేస్తున్నాం అన్నట్లుగా ప్రమోషన్ కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు. ఈ మధ్య కాలంలో హిందీ సినిమాలు సక్సెస్ అవ్వాలంటే గట్టి కంటెంట్ అవసరం. మరి ఆ కంటెంట్ ఇందులో ఉందా అనేది చూడాలి.