ఇలా చేస్తే జనం థియేటర్లకు వస్తారా?
`బడే మియాన్ చోటే మియాన్` ప్రమోషన్స్ విషయంలో బాలీవుడ్ క్రిటిక్స్ పాజిటివ్ సమీక్షలను స్ప్రెడ్ చేసినా అది ఏమంత కలిసి రాలేదు.
By: Tupaki Desk | 15 April 2024 4:32 AM GMTఅక్షయ్ కుమార్ - టైగర్ ష్రాఫ్ లాంటి భారీ యాక్షన్ స్టార్లు నటించిన హిందీ సినిమా `బడే మియాన్ చోటే మియాన్` బాక్సాఫీస్ రిజల్ట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. అలీ అబ్బాస్ జాఫర్ రొటీన్ యాక్షన్ సినిమా తీయడంతో జనం లేక థియేటర్లు వెలవెలబోతున్నాయని ట్రేడ్ చెబుతోంది.
`బడే మియాన్ చోటే మియాన్` ప్రమోషన్స్ విషయంలో బాలీవుడ్ క్రిటిక్స్ పాజిటివ్ సమీక్షలను స్ప్రెడ్ చేసినా అది ఏమంత కలిసి రాలేదు. ఒక గమ్మత్తయిన విషయం ఏమంటే.. అక్షయ్- టైగర్ ష్రాఫ్ లాంటి క్రేజీ యాక్షన్ స్టార్లతో ఈ సినిమాని అత్యంత భారీ గా నిర్మించారు. భారీ యాక్షన్ బ్లాకులన్నీ జోర్డాన్ దేశంలో తెరకెక్కాయి. అందువల్ల చిత్ర నిర్మాతలు తమ సినిమా సెట్‌లను సందర్శించడానికి జోర్డాన్‌కు చాలా మంది హిందీ పాత్రికేయులు, విమర్శకులు, సోషల్ మీడియా ప్రభావశీలులురను తీసుకెళ్లారు. సినీ విమర్శకుల కోసం జోర్డాన్ వంటి దేశానికి ఉచిత యాత్రను స్పాన్సర్ చేయడం అరుదైనది. అయితే ఇది ఫలించి ప్రమోషన్స్ లో ఈ సినిమా గురించి ఎక్కడా నెగెటివిటీ స్ప్రెడ్ కాలేదు. బడే మియాన్ ఛోటే మియాన్ కోసం సానుకూల సమీక్షలతో మొత్తం సోషల్ మీడియాను నింపారు. కానీ సాధారణ జనాలకు మాత్రం ఇది అంతగా నచ్చలేదు.
థియేటర్లు వెలవెల బోతుండడంతో బడే మియాన్ చోటా మియాన్ కి వన్ ప్లస్ వన్ టికెట్ ను ఆఫర్ చేసారు. నిజానికి దీనిని బట్టి ఒక విషయం అర్థం చేసుకోవాలి. సినిమాలో కంటెంట్ ఉంటే సమీక్షలు ఎలా రాసినా సినిమా హిట్టవుతుంది. ప్రేక్షకులు కేవలం సమీక్షలను నమ్మి మాత్రమే థియేటర్లకు వెళ్లడం లేదు. ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ని పరిశీలించి వాటిని నమ్మితేనే థియేటర్లకు వెళుతున్నారని అర్థం చేసుకోవాలి. ట్రైలర్ దశ నుంచే తేలిపోయిన బడే మియాన్ చోటా మియాన్ ని సమీక్షకుల పాజిటివిటీ కూడా కాపాడలేకపోయింది.