చెత్త సినిమాకి భారీ ఓపెనింగులు?
బ్యాడ్ న్యూజ్ చిత్రం తొలి రోజు 8.7 కోట్లు వసూలు చేసింది. రెండోరోజు మూడోరోజు సెలవులు కలిసొచ్చి వసూళ్లు 30కోట్లకు చేరుకుంటాయని చెబుతున్నారు
By: Tupaki Desk | 21 July 2024 9:17 AM GMTఏ సినిమాకి అయినా మంచి ఓపెనింగులు రావాలంటే ప్రచారం కీలకం. మంచి ప్రచారపు ఎత్తుగడ ఫలిస్తే అది చెత్త సినిమా అయినా కానీ తొలి మూడు రోజుల్లోనే సేఫ్ జోన్ లోకి వస్తుంది. అలాంటి ఒక చెత్త సినిమా ఇప్పుడు తొలి మూడు రోజుల్లోనే రూ.30 కోట్లు వసూలు చేస్తూ బాలీవుడ్ ట్రేడ్ ని ఆశ్చర్యపరుస్తోందని విశ్లేషిస్తున్నారు. ఇంతకీ ఇది ఏ సినిమా అంటే? విక్కీ కౌశల్- ట్రిప్తి దిమ్రీ- అమీ విర్క్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్యాడ్ న్యూజ్ గురించే ఇదంతా. ఈ సినిమా ఓపెనింగుల్లో నిజంగానే గుడ్ న్యూస్ చెప్పగా, రివ్యూలు మాత్రం వెరీ బ్యాడ్ అని నిరాశపరిచాయి. బ్యాడ్ న్యూజ్ చిత్రం తొలి రోజు 8.7 కోట్లు వసూలు చేసింది. రెండోరోజు మూడోరోజు సెలవులు కలిసొచ్చి వసూళ్లు 30కోట్లకు చేరుకుంటాయని చెబుతున్నారు.
అడల్ట్ కామెడీ, శృంగార సన్నివేశాలతో నింపేసిన ఈ సినిమా ఈ ఏడాది వచ్చిన బాలీవుడ్ చెత్త సినిమాల్లో ఒకటిగా ముద్ర వేస్తూ కొందరు హిందీ క్రిటిక్స్ తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా శృంగారంలో హద్దు మీరే ఇలాంటి పాత్రలో నటించిన ట్రిప్తి దిమ్రీని అభిమానులు తిట్టి పోసారు. ఈ భామ హద్దు మీరిందని కూడా వ్యాఖ్యానించారు. ఇద్దరు కుర్రాళ్లతో రొమాన్స్ చేసే అమ్మాయి ఫ్రెగ్నెంట్ అయ్యాక.. బిడ్డ తండ్రి ఎవరో తెలీని సందిగ్ధంలోకి వెళ్లిపోతుంది. ఈ స్టోరీ లైన్ శ్రుతి మించిందని, ఇర్రిటేట్ చేసిందని కూడా కొందరు సమీక్షకులు అభిప్రాయపడ్డారు. ఒకరికి మించి భాగస్వాములతో శృంగారంలో పాల్గొనే యువతి కథను అనైతికంగా ఇలా తెరపై చూపడమేమిటీ అని కొందరు విరుచుకుపడ్డారు.
అయితే బ్యాడ్ న్యూజ్ ఓపెనింగుల పరంగా యూరి రికార్డును బ్రేక్ చేస్తోంది. విక్కీకౌశల్ కెరీర్ లో `యూరి` క్లాసిక్ హిట్ గా నిలిచింది. ఆ సినిమా రికార్డునే ఇది కొట్టేస్తోంది. చెత్త సినిమా అయినా కానీ ఇంత భారీ ఓపెనింగులు ఆశ్చర్యపరుస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. సామ్ బహదూర్, జర హట్కే లాంటి హిట్ చిత్రాల తర్వాత విక్కీకి ఇది ఆశించిన మంచి సినిమా కాదని క్రిటిక్స్ వ్యాఖ్యానిస్తున్నారు. ఇక సోమవారం నుంచి బ్యాడ్ న్యూజ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రన్ కొనసాగిస్తుందోనన్న సందిగ్ధం ఉంది.