Begin typing your search above and press return to search.

బఘీర' ట్రైలర్: 'దేవుడు ఎందుకు రాడు?'

క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ బి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

By:  Tupaki Desk   |   21 Oct 2024 5:29 AM GMT
బఘీర ట్రైలర్: దేవుడు ఎందుకు రాడు?
X

కన్నడ మూవీ ఉగ్రం ఫేమ్ రోరింగ్ స్టార్ శ్రీ మురళి నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ బఘీర. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథ అందించిన ఆ సినిమాకు డాక్టర్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. కేజీఎఫ్ సిరీస్ చిత్రాల నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్‌ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ బి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు.


ప్రకాష్ రాజ్, రంగాయన రఘు, అచ్యుత్ కుమార్, గరుడ రామ్ వంటి టాలెంటెడ్ యాక్టర్స్ భాగమైన బఘీర మూవీ.. దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన తెలుగు, కన్నడ భాషల్లో విడుదల కానుంది. టాలీవుడ్ లో శ్రీ మురళికి ఫస్ట్ రిలీజ్ ఇదే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్‌ సురేష్‌ ఎంటర్టైన్మెంట్‌ ఎల్‌ ఎల్‌ పీ.. బఘీరను విడుదల చేయనుంది. అయితే తాజాగా మేకర్స్ తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

అమ్మా.. దేవుడు రామాయణం, మహాభారతం అని ఎప్పుడూ ఒక్కొక్కసారి వస్తాడు. ఎప్పుడు ఎందుకు రాడు? అని కూతురు అడగ్గా అప్పుడు.. దేవుడు అన్నిసార్లు రాడు.. సమాజంలో పాపాలు మితి మీరినప్పుడు, మంచిని చెడు తొక్కేసినప్పుడు.. సమాజంలో కుళ్ళు పెరిగినప్పుడు, మనుషులు మృగాళ్లు అయినప్పుడు ఆయన ఆ అవతారమెత్తుతాడు అంటూ అమ్మ చెబుతున్నట్లు బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది.

దేవుడిలాగే కాదు.. అప్పుడప్పుడు రాక్షసుడిలా కూడా రావచ్చు.. అంటూ చెబుతుండగా హీరో శ్రీ మురళి (బఘీర)గా ఎంట్రీ ఇచ్చారు. అనేక మంది హతమార్చుతూ కనిపిస్తుంటారు. మధ్యలో హీరోయిన్ తో లవ్ ట్రాక్ ను చూపించారు. అయితే బఘీర చంపుతున్నది క్రిమినల్స్ ను సర్.. మనం చేయాల్సిన పని ఆయన చేస్తున్నాడని ఓ పోలీస్ చెప్పడంతో సినిమా కాన్సెప్ట్ కాస్త అర్థమైనట్లే. మరి చివరికి ఏం జరిగిందనేది మొత్తం చిత్రంగా ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.

మొత్తానికి ట్రైలర్ సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. శ్రీ మురళి యాక్టింగ్ బాగుంది. డైలాగ్స్ పవర్ ఫుల్ గా ఉన్నాయి. సినిమాలో యాక్షన్ సీన్స్ వేర్ లెవెల్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఫైట్ సీక్వెన్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి. హీరోకు ఎలివేషన్స్ ఇచ్చిన తీరు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయని చెప్పాలి. అమ్మ సెంటిమెంట్, ముసుగు వేసుకొని చంపడం చూస్తే.. కేజీఎఫ్ మూవీ అందరికీ గుర్తొస్తుంది. మరి బఘీర సినిమా ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.