Begin typing your search above and press return to search.

అప్ క‌మింగ్ రిలీజ్ లు బాహుబ‌లి-2ని ట‌చ్ చేసేలా!

ఈ నేప‌థ్యంలో బాహుబ‌లి నిర్మాత‌ల్లో ఒకరైన శోభు యార్ల‌గ‌డ్డ టికెట్ల అమ్మ‌కాల విష‌యంలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు.

By:  Tupaki Desk   |   30 Oct 2024 6:12 AM GMT
అప్ క‌మింగ్ రిలీజ్ లు బాహుబ‌లి-2ని ట‌చ్ చేసేలా!
X

పాన్ ఇండియా మార్కెట్ లో తెలుగు సినిమాకు తెలుగు సినిమాగానే పోటీగా మ‌రింది. టాలీవుడ్ క్రియేట‌ర్స్ ఆ రేంజ్ లో కంటెంట్ ఇవ్వ‌డంతోనే ఇది సాధ్య‌మ‌వుతుంది. మేక‌ర్స్ అంతా ఎవ‌రికి వారు? ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా చిత్రాలు తీస్తున్నారు. `బాహుబ‌లి` నుంచి మొద‌లైన ఈ ప్ర‌స్తానం దిగ్విజ‌యంగా కొన‌సాగుతుంది. త్వ‌ర‌లో మ‌రిన్ని పాన్ ఇండియా సినిమాలు థియేట‌ర్లోకి రాబోతున్నాయి. ఈ నేప‌థ్యంలో బాహుబ‌లి నిర్మాత‌ల్లో ఒకరైన శోభు యార్ల‌గ‌డ్డ టికెట్ల అమ్మ‌కాల విష‌యంలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు.

అవేంటో ఆయ‌న మాట‌ల్లోనే.. టికెట్లు అమ్మ‌కాల్లో `బాహుబ‌లి-2` త‌ర్వాత వ‌చ్చిన చిత్రాలేవి వాటి రికార్డు అందుకో లేద‌న్నారు. అందులో సగానికి మించి టికెట్ల అమ్మకాలు చేయలేకపోయాయని ఆయన వెల్లడించారు. ‘బాహు బలి-2’కు ఏకంగా 10 కోట్లకు పైగా టికెట్లు అమ్మినట్లు తెలిపారు. `ఆర్ఆర్ఆర్`, `కేజీఎఫ్-2` లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్‌కు కూడా ఇందులో సగం టికెట్లు మాత్రమే అమ్ముడ‌య్యాయ‌న్నారు.

ఇండియన్ సినిమాకు సంబంధించి అత్యధిక టికెట్ల అమ్మకాలు జరిగిన సినిమాగా ‘షోలే’ పేరిట రికార్డు ఉన్నట్లు గుర్తు చేసారు. ఆ చిత్రానికి 13 కోట్లకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయని, కానీ ఆ చిత్రం సంవత్సరాల తరబడి ఆడింది కాబట్టే ఆ ఘనత సాధించింద‌న్నారు. కానీ `బాహుబ‌లి` తక్కువ థియేట్రికల్ రన్‌తోనే 10 కోట్ల మార్కును అందుకుం ద‌న్నారు. అయితే రాబోయే సినిమాలు బాహుబ‌లి-2 వ‌సూళ్లను ట‌చ్ చేయోచ్చ‌ని అంచ‌నా వేసారు.

దానికి కార‌ణం పెరిగిన టికెట్ ధ‌ర‌లుగా చెప్పుకొచ్చారు. త‌మ సినిమా రిలీజ్ స‌మ‌యంలో టికెట్ ధ‌ర 125 ఉంటే? ఇప్పుడు అదే టికెట్ ధ‌ర 300 గా ఉంద‌న్నారు. ఈ నేప‌థ్యంలో వ‌సూళ్ల ప‌రంగా త్వ‌ర‌లో రిలీజ్ అయ్యే పాన్ ఇండియా సినిమాలు బాహుబ‌లి రికార్డుల‌ను టిచ్ చేయోచ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు.