ప్రభాస్ బాలీవుడ్ బాక్సాఫీస్.. నెక్స్ట్ కొట్టేది ఎవరు?
బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సౌత్ హీరోల డామినేషన్ హై రేంజ్ లో ఉంటుంది అని గత కొన్నేళ్ల క్రితం వరకు ఎవరు ఊహించలేదు
By: Tupaki Desk | 28 Aug 2024 5:24 AM GMTబాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సౌత్ హీరోల డామినేషన్ హై రేంజ్ లో ఉంటుంది అని గత కొన్నేళ్ల క్రితం వరకు ఎవరు ఊహించలేదు. కటౌట్ తో పాటు కంటెంట్ క్లిక్కయితే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అందుకుంటారు అని ఇప్పుడు వస్తున్న స్టార్స్ సినిమాలు నిరూపిస్తున్నాయి. ఇక అందులో ముఖ్యంగా ప్రభాస్ పాన్ ఇండియా మొత్తంలో కూడా అత్యధిక మార్కెట్ ఉన్న హీరోగా కొనసాగుతున్నాడు.
ప్రతి సినిమాతో అతనికి బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ అయితే అందుతూ ఉన్నాయి. ముఖ్యంగా హిందీ హిందీ మార్కెట్లో పట్టు సాధించడం అంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు ప్రభాస్ తో పాటు మిగతా హీరోలు కూడా ఎంతో కొంత డామినేషన్ చూపిస్తున్నారు. ఇక అల్లు అర్జున్ పుష్ప 1 సినిమాతో హిందీలో వంద కోట్ల కలెక్షన్స్ అందుకుని అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాడు. రీసెంట్ గా ప్రభాస్ మరోసారి కల్కి సినిమాతో 280 కోట్ల కలెక్షన్స్ తో అక్కడ పట్టు సాధించాడు.
మొదట 'బాహుబలి' చిత్రంతో సౌత్ నుంచి నేషనల్ లెవల్ స్టార్డమ్‌ని సొంతం చేసుకున్న ప్రభాస్, ఆ తర్వాత ‘సాహో’ మరియు ‘రాధే శ్యామ్’ చిత్రాలతో హిందీ మార్కెట్‌కి బాగా దగ్గరయ్యాడు. 'బాహుబలి 2' సినిమా హిందీ మార్కెట్‌లో సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఆ సినిమా మొదటి తొలి రోజు 41 కోట్ల వసూళ్లు రాబట్టింది. అలాగే మొత్తంగా 511 కోట్ల గ్రాస్ వసూలు చేసి హిందీ మార్కెట్‌లో నెంబర్ వన్ సౌత్ సినిమాగా కొనసాగుతోంది.
ఇక ఆ రికార్డ్ ను నెక్స్ట్ ఎవరు కొట్టగలరు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. తాజాగా అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో ఆ రికార్డులను అధిగమించే అవకాశాలు ఉండటంతో ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాలు ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. పుష్ప 1 తోనే హిందీ భాషలోనూ బన్నీకి మంచి క్రేజ్ వచ్చింది. అయితే, పుష్ప 2 ని హిందీలో భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతుండటంతో, ఈసారి బాహుబలి రికార్డులను పుష్ప 2 క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.
తొలి రోజు వసూళ్లలో 'బాహుబలి 2' రికార్డును పుష్ప 2 సునాయాసంగా దాటుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ, మొత్తం వసూళ్లలో 511 కోట్ల మార్క్ ను దాటడం మాత్రం సినిమా కంటెంట్ మీదే ఆధారపడి ఉంటుంది. కంటెంట్ బాగుంటే, పుష్ప 2 ప్రభాస్ సృష్టించిన రికార్డులను అధిగమించడం ఖాయం అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.
ఇక మిగతా హీరోల సంగతి చూసుకుంటే.. ప్రస్తుతం రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ - బుచ్చిబాబు దర్శకత్వంలో చేసే పాన్ ఇండియా ప్రాజెక్ట్ లపై పెద్దగా బజ్ లేదు. బాహుబలి 2 నెంబర్ ను ఇవి క్రాస్ చేయడం కష్టమే. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమాకు ఆ శక్తి ఉంది కాని అది కూడా కంటెంట్ బాలంగా ఉంటేనే సాధ్యమయ్యే అవకాశం ఉంది. ఇక దేవర 1 కు ఆ రేంజ్ బజ్ అయితే హిందీలో కనిపించడం లేదు. ఇప్పుడు కేవలం అల్లు అర్జున్ కు మాత్రమే హిందీలో బాహుబలి 2 రికార్డ్ ను బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. మరి అతను ఈ ఛాన్స్ ను ఎంతవరకు ఉపయోగించుకుంటాడో చూడాలి.