Begin typing your search above and press return to search.

'బాహుబ‌లి' సేనాప‌తిలో చాలా ఉందే!

బాహుబ‌లి చిత్రంలో సేనాప‌తి పాత్ర తో మెప్పించిన రాకేష్ వ‌ర్రే సుప‌రిచితుడే

By:  Tupaki Desk   |   20 July 2023 12:45 PM GMT
బాహుబ‌లి సేనాప‌తిలో చాలా ఉందే!
X

`బాహుబ‌లి` చిత్రంలో సేనాప‌తి పాత్ర తో మెప్పించిన రాకేష్ వ‌ర్రే సుప‌రిచితుడే. తొలి సినిమా రాకేష్ కి ఇండ‌స్ట్రీ లో మంచి గుర్తింపు తీసుకొచ్చింది. రాజ‌మౌళితో క‌లిసి ప‌నిచేయ‌డం..పెద్ద బ్యాన‌ర్లో సినిమా చేయ‌డంతో ప‌రిశ్ర‌మ‌లో ప‌రిచ‌యాల‌కు ఉప‌యుక్తంగా మారింది. ఆ గుర్తింపుతో నిర్మాణ రంగంలోకి దిగాడు. అయితే ఈ విష‌యం చాలా మందికి తెలియ‌దు. క్రేజీ యాంట్స్ ప్రొడ‌క్ష‌న్స్ పేరుతో ఓ బ్యాన‌ర్ స్థాపించిన‌ట్లు తెలుస్తోంది.

తాజాగా ఈ బ్యాన‌ర్ పై `పేక‌మేడ‌లు` అనే సినిమా నిర్మించారు. ఈ సినిమా ద్వారా 50 మంది కొత్త న‌టీన‌టులు..సాంకేతిక నిపుణులు ప‌రిచ‌యం అవుతున్నారు. నీల‌గిరి మామిళ్ల అనే కొత్త కుర్రాడు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అయితే బ్యాన‌ర్ స్థాపించి ఇంత‌మంది కొత్త వాళ్ల‌ని ప‌రిచ‌యం చేయ‌డం అన్న‌ది మెచ్చుకో ద‌గ్గ విష‌యం. ఓ వైపు న‌టుడిగా త‌న ప్ర‌య‌త్నాలు తానుచేస్తూనే ఔత్సాహికుల్ని ప్రోత్స‌హిస్తూ సినిమాలు నిర్మిస్తున్నాడు.

`బాహుబ‌లి` నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన వెంట‌నే నిర్మాత‌గా ప్ర‌యాణం మొదలు పెట్టిన‌ట్లు తెలుస్తోంది. తొలి సినిమా `ఎవ‌రికీ చెప్పొద్దు` అనే సినిమా చేసాడు. ఇందులో అత‌నే హీరో..అత‌నే నిర్మాత‌. ఆ సినిమాతో త‌న‌లో ఫ్యాష‌న్ నిరూపించుకునే ప్ర‌య‌త్నం చేసాడు. ఆ సినిమా పెద్ద‌గా స‌క్సెస్ కాన‌ప్ప‌టికీ ప్ర‌య‌త్నాలు మాత్రం ఆప‌లేదు. ఓవైపు స్టార్ హీరోల చిత్రాల్లో అవ‌కాశాలు కోసం ప్ర‌య‌త్నిస్తూనే ఇలా నిర్మాణ రంగంలోనూ రాణిస్తున్నాడు.

త‌న ఫ‌రిదిలో సినిమాలు చేసుకుంటూ కొత్త వారికి అవ‌కాశాలు క‌ల్పిస్తున్నాడు. అయితే పేక‌మేడ‌లు సినిమాలో రాకేష్ న‌టించే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు లేదు. పూర్తిగా కొత్త వారికే అవ‌కాశాలు క ల్పించి తాను వెనుకున్న‌ట్లు తెలుస్తోంది. తాజాగా ఆ సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు మొద‌లు పెట్టారు. వ‌చ్చే నెల‌లో రిలీజ్ ప్లాన్ చేసుకుంటోన్న నేప‌త్యంలో మోష‌న్ పోస్ట‌ర్లు ..టీజ‌ర్..ట్రైల‌ర్ అంటూ టీమ్ నెట్టింట హ‌డావుడి చేస్తోంది. ఆ ర‌కంగా `బాహుబ‌లి` సేనాప‌తి నిర్మాత‌గానూ ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌మోట్ అవుతున్నాడు.