Begin typing your search above and press return to search.

బాహుబ‌లి విగ్ర‌హంపై మైసూర్ మ్యూజియం వివ‌ర‌ణ‌!

'ఎవ‌రి మ‌నో భావాలు దెబ్బతీయాల‌ని అలా చేయ‌లేదు. అభ్యంత‌రాలు వ్య‌క్తం అవుతున్నాయి కాబ‌ట్టి మ్యూజియం నుంచి విగ్రహాన్ని తొలగిస్తామ‌ని' చెప్పారు.

By:  Tupaki Desk   |   27 Sep 2023 11:43 AM GMT
బాహుబ‌లి విగ్ర‌హంపై మైసూర్  మ్యూజియం వివ‌ర‌ణ‌!
X

మైసూర్ మ్యూజియంలో వెల‌సిన అమ‌రేంద్ర‌బాహుబ‌లి (ప్ర‌భాస్) విగ్ర‌హంపై నెట్టింట ఏ రేంజ్ లో ట్రోలింగ్ జ‌రిగిందో తెలిసిందే. దీనిపై ప్ర‌భాస్ అభిమానులు..చిత్ర నిర్మాత శోభు యార్ల‌గ‌డ్డ సైతం తీవ్ర స్థాయిలో ధ్వ‌జమెత్తారు. త‌మ అనుమ‌తి లేకుండా మ్యూజియం లో ఇలాంటి విగ్ర‌హాలు ఎలా పెడ‌తార‌ని మండిప‌డ్డారు. ఇక అభిమానుల విమ‌ర్శ‌లు..కామెంట్ల గురించైతే చెప్పాల్సిన ప‌నిలేదు.

త‌మ‌దైన శైలిలో విమర్శ‌లు గుప్పించారు. ఒక‌రు అదే విగ్ర‌హాన్ని రామ్ చ‌ర‌ణ్ విగ్ర‌హంలా ఉందంటూ... మ‌రొకొరు విగ్ర‌హాన్ని త‌యారు చేసిన ఆ క‌ళాకారులు ఎవ‌రంటూ! ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసారు. 'బాహుబ‌లి'లో అంత గొప్ప పాత్ర‌ని అంత చెత్త‌గా ఎలా డిజైన్ చేస్తార‌ని మండిప‌డ్డారు. దీంతో వెను వెంట‌నే నిర్మాత‌లు వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది. ఇది అధికారికంగా లైసెన్స్ పొందింది కాదు. మా అనుమతి చేసారు. దీన్ని తొలగించడానికి మేము తక్షణమే చర్యలు తీసుకుంటాము. చ‌ట్ట‌ప‌రైమ‌న చ‌ర్య‌లు తీసుకుంటాం' అని శోభు పేజీలో రాసుకొచ్చారు.

ఇది నెట్టింట జోరుగా వైర‌ల్ అయింది. తాజాగా ఈ అభ్యంత‌రాల‌పై మైసూర్ మ్యూజియం అధినే ఓ ప్రముఖ దినపత్రిక ద్వారా వివ‌ర‌ణ ఇచ్చారు. 'ఎవ‌రి మ‌నో భావాలు దెబ్బతీయాల‌ని అలా చేయ‌లేదు. అభ్యంత‌రాలు వ్య‌క్తం అవుతున్నాయి కాబ‌ట్టి మ్యూజియం నుంచి విగ్రహాన్ని తొలగిస్తామ‌ని' చెప్పారు. దీంతో అన్ని ర‌కాల క‌థ‌నాల‌కు బ్రేక్ ప‌డింది. ఇక అమ‌రేంద్ర బాహుబ‌లి విగ్ర‌హం మ్యూజియంలో ఏర్పాటు చేయాలంటే! ముందుగా నిర్మాత‌ల అనుమ‌తి తీసుకోవాలి.

అలాగే విగ్ర‌హం త‌యారైన త‌ర్వాత దాన్ని ముందుగా స‌ద‌రు నిర్మాత‌ల‌కు చూపించి..వాళ్లు అంగీక‌రించిన త‌ర్వాత ప్ర‌తిష్టించాలి. దీనికి సంబంధించి పూర్తి హ‌క్కులు నిర్మాత‌ల‌కే చెందుతాయి. ఇప్ప‌టికే బాహుబ‌లి మైన‌పు విగ్ర‌హం బ్యాంకాక్ లోని మేడ‌మ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. దిగ్గజాలకు మాత్రమే చోటు దక్కే ఈ మ్యూజియంలో చోటు దక్కించుకోనున్న తొలి తెలుగు నటుడు ప్రభాస్. ప్రధాని నరేంద్ర మోదీ మైనపు బొమ్మను ఈ మ్యూజియంలో ఏర్పాటు చూసారు.