Begin typing your search above and press return to search.

బహుముఖం టీజర్..ఎలా ఉందంటే..

బహుముఖం మూవీలో ప్రధాన పాత్రలో నటిస్తూ.. రచన, దర్శకనిర్మాత బాధ్యతలను చేపట్టారు ఈ కుర్ర హీరో.

By:  Tupaki Desk   |   24 Feb 2024 11:06 AM GMT
బహుముఖం టీజర్..ఎలా ఉందంటే..
X

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి యంగ్ అండ్ మల్టీ టాలెంటెడ్ హీరో హర్షివ్ కార్తీక్ సిద్ధమవుతున్నారు. బహుముఖం మూవీలో ప్రధాన పాత్రలో నటిస్తూ.. రచన, దర్శకనిర్మాత బాధ్యతలను చేపట్టారు ఈ కుర్ర హీరో. గుడ్, బ్యాడ్ & ది యాక్టర్ అనే ట్యాగ్‌ లైన్‌తో ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇటీవల మేకర్స్ రిలీజ్ చేశారు. పోస్టర్ లో మల్టీ డైమెన్షనల్ అవతార్ లో కనిపించి ఆకట్టుకున్నారు హర్షివ్. ఫస్ట్ ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ జోష్ తోనే తాజాగా బహుముఖం మేకర్స్.. ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. మూవీ టీజర్ ను శనివారం లాంఛ్ చేశారు.

యాక్టింగ్ అంటే అంత ఇష్టమా అమ్మ నీకు.. నేను కూడా యాక్టర్ అవుతా.. అని హీరో చిన్నప్పటి డైలాగ్ తో టీజర్ ప్రారంభమైంది. ఇక హీరో తన కల నిజం చేసుకోవడానికి తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు. యాక్టర్ అవ్వాలనేది, తన డ్రీమ్ అంటూ ఒకరి దగ్గరకు వెళ్లి చెబుతాడు. ఇక ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. యాక్టర్ అయ్యే క్రమంలో అవమానాలు ఎదుర్కొంటాడు. అతడి వద్ద ఉన్న రహస్యాల కారణంగా అనేక మంది ఇబ్బందిపడతారు. చివరకు ఏం అవుతుంది? అనేదే మిగతా కథ. మొత్తానికి టీజర్ లో స్టోరీ లైన్ క్లారిటీగా లేనప్పటికీ ఊహించని మలుపులతో మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంది.

టీజర్ ను బట్టి చూస్తే.. ఈ మూవీకి బహుముఖం అని టైటిల్ పెర్ఫెక్ట్ సెట్ అయినట్లు కనిపిస్తోంది. హీరో హర్షివ్ కార్తీక్ మల్టీపుల్ షేడ్స్ లో అదరగొట్టారు. డైరెక్షన్ కూడా బాగా చేశారు. హీరోయిన్లు స్వర్ణిమా సింగ్, మరియా మర్టినోవా తమ నటనతో ఆకట్టుకున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మూవీకి బిగ్గెస్ట్ ఎసెట్ గా మారే అవకాశం ఉంది. ల్యూక్ ఫ్లెచర్ సినిమాటోగ్రఫీ కూాడా బాగుంది.

ఈ సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్ మూవీ షూటింగ్ ను అట్లాంటా, మాకాన్, కాంటన్, జార్జియా, అమెరికా పరిసర ప్రాంతాల్లో జరిపారు. క్రిస్టల్ మౌంటైన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై రూపొందిన ఈ చిత్రానికి అరవింద్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించారు. రామస్వామి, హర్షివ్ కార్తీక్ డైలాగ్స్ అందించిన ఈ సినిమాకు.. ఫణి కళ్యాణ్ సంగీత దర్శకుడిగా పనిచేశారు. గ్యారీ బిహెచ్‌ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్.