రేణుకాస్వామి హత్య కేసులో బెయిల్ ఎంతమందికంటే?
అలాగే పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ వీరిపై హత్యానేరం మోపగా ఇప్పుడా పేర్లను చార్జ్ షీట్ నుంచి తొలగించినట్లు వార్తలొస్తున్నాయి.
By: Tupaki Desk | 24 Sep 2024 9:46 AM GMTదేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కన్నడ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో ఎట్టకేలకు ముగ్గురుకు బెయిల్ వచ్చింది. హైకోర్టు ఈ ముగ్గురుకి బెయిల్ మంజూరు చేసింది. అలాగే పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ వీరిపై హత్యానేరం మోపగా ఇప్పుడా పేర్లను చార్జ్ షీట్ నుంచి తొలగించినట్లు వార్తలొస్తున్నాయి. కేశవ మూర్తి అనే వ్యక్తి పోలీసులకు లొంగిపోయాడు. అతనితో పాటు మరో ఇద్దరు కార్తీక్, నిఖిల్ కు కూడా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
నిందితుల జాబితా నుంచి ఆ ముగ్గురు పేర్లను తొలగించినట్లు వార్తలొస్తున్నాయి. మూడు నెలలుగా ఈ కేసులో మొత్తం 17 మంది వివిధ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. కన్నడ నటి పవిత్ర గౌడ్ ఏ1 గాండగా, నటుడు దర్శన్ 2 గా కేసులో ఉన్నాడు. ఈ కేసులో సాక్షాలన్నీ దర్శన్ కి వ్యతిరేకంగానే ఉన్నాయి. దీంతో అతడికి బెయిల్ దొరకడం లేదు. ఆయన భార్య విజయ లక్ష్మి దర్శన్ అరెస్ట్ అయిన నాటి నుంచి బెయిల్ కోసం అన్నిర కాల ప్రయత్నాలు చేస్తున్నారు.
కానీ దొరకడం లేదు. ప్రస్తుతం దర్శన్ బళ్లారి జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అతకు ముందు పరప్పన్ అగ్రహారం జైల్లో ఉండగా..అక్కడ సౌకర్యాలు ఎక్కువ అవ్వడంతో బళ్లారి జైలుకు తరలించారు. పవిత్రా గౌడ్ సహా మిగతా వారంతా పరప్పన్ జైల్లోనే ఉన్నారు. తొలుత కేసులో 15 మంది పేర్లు వినిపించగా, ఆ తర్వాత అదనంగా మరో ఇద్దరు చేరారు. ఇంకా కేసులో అనుమానితుల్ని కొందర్ని పోలీసులు విచారించి పంపించారు.
వాళ్లందరిపై పోలీసులు నిఘా వేసి ఉంచారు. పోలీసుల విచారణ దాదాపు పూర్తి అయినట్లు తెలుస్తోంది. పోలీసులు కోర్టుకు సమర్పించాల్సిన సాక్ష్యాలను సమర్పించారు. అందుకే కేసులో కొందరికి బెయిల్ వచ్చినట్టు తెలుస్తోంది.