'అఖండ-2' బాక్సాఫీస్ టార్గెట్ ఎంత?
నటసింహ బాలకృష్ణ `అఖండ` విజయంతో బాక్సాఫీస్ వద్ద అతడి కెరీర్ పరంగా సరికొత్త రికార్డు సృస్టించారు.
By: Tupaki Desk | 12 Feb 2025 9:30 AM GMTనటసింహ బాలకృష్ణ `అఖండ` విజయంతో బాక్సాఫీస్ వద్ద అతడి కెరీర్ పరంగా సరికొత్త రికార్డు సృస్టించారు. ఆసినిమా ఏకంగా 150 కోట్ల వసూళ్లను సాధించింది. బాలయ్య కెరీర్లో ఇప్పటివరకూ ఇదే భారీ వసూళ్ల చిత్రం. `అఖండ` తర్వాత రిలీజ్ అయిన `వీరసింహారెడ్డి`, `భగవంత్ కేసరి` ,` డాకు మహారాజ్` భారీ విజయాలు సాధించినా బాక్సాఫీస్ లెక్కలు 140 కోట్ల లోపే ఉన్నాయి. 100-140 కోట్ల మధ్య లో ఆ సినిమా వసూళ్లు కనిపిస్తున్నాయి.
అంటే ఇప్పటికీ `అఖండ` మాత్రమే టాప్ లో ఉన్నట్లు గా చెప్పొచ్చు. ఇప్పుడు `అఖండ`కు సీక్వెల్ గా` అఖండ2 శివతాండవం` బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రూపొం దుతున్న చిత్రమిది. ఇదే ఏడాది కుంభమేళా ఉత్సవం కూడా జరగడంతో? సినిమాకు మరింత కలిసొస్తుంది. మరి ఈసినిమా బాక్సాఫీస్ టార్గెట్ ఎంత అంటే? నాలుగేళ్ల క్రితం రిలీజ్ అయిన అఖండ 150 కోట్లు అంటే? బాలయ్య మార్కెట్ ఇప్పుడు రెట్టింపు అయినట్లే.
వరుసగా బాలయ్య విజయాలు ఆయన మార్కెట్ ని పెంచాయి. అఖండ తర్వాత బాలయ్యకు వైఫల్యం లేదు. ఈ నేపథ్యంలో అఖండ బాక్సాఫీస్ టార్గెట్ 300 కోట్లపైనే ఫిక్స్ చేసి బరిలోకి దిగాల్సి ఉంటుంది. అయితే టార్గెట్ అన్నది పూర్తిగా సినిమా నిర్మాణ వ్యయాన్ని బట్టి ఉంటుంది. ఈసారి అఖండ -2 పాన్ ఇండియాలో ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి బడ్జెట్ కూడా భారీగా నే ఉంటుంది. అఖండ చిత్రాన్ని 60 కోట్లలో నిర్మించారు.
ఇప్పుడు అఖండ 2కి 120 కోట్లు వేసుకున్నా? వసూళ్ల పరంగా ఈ సినిమా 300 కోట్లు పక్కాగా రాబట్టాల్సిన చిత్రమిది. హిందుత్వం కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని చేస్తోన్న చిత్రమిది. తెలుగుకంటే ఎక్కువ క్రేజ్ ఉత్తరాది రాష్ట్రాల్లో కనిపిస్తుంది. కుంభమేళాలో అఖండ పోస్టర్లు....బస్సులపై బ్యానర్లు చూస్తుంటే? అఖండ అక్కడ ఎంతగా ప్రభావితం చేసిందన్నది అద్దం పడుతుంది.