Begin typing your search above and press return to search.

బాలీవుడ్ హీరోలు మ‌న‌ల్ని కాపీ కొట్టి ఊపిరిపోసుకున్నారు: ఎన్బీకే

న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన `డాకు మ‌హారాజ్` ఈ సంక్రాంతి కానుక‌గా విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   18 Jan 2025 9:30 PM GMT
బాలీవుడ్ హీరోలు మ‌న‌ల్ని కాపీ కొట్టి ఊపిరిపోసుకున్నారు: ఎన్బీకే
X

న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన `డాకు మ‌హారాజ్` ఈ సంక్రాంతి కానుక‌గా విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే 110 కోట్లు పైగా వ‌సూలు చేసిన ఈ చిత్రం సంక్రాంతికి క్లీన్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా క‌థానాయ‌కుడు నంద‌మూరి బాల‌కృష్ణ‌, ద‌ర్శ‌కుడు బాబి, క‌థానాయిక‌లు శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్, ప్ర‌గ్య జైశ్వాల్, సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ త‌దిత‌రులు ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉన్నారు.

సీనియ‌ర్ యాంక‌ర్ సుమ‌తో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో టీమ్ ఎంతో ఉల్లాసంగా ఎన్బీకే `వ‌న్ లైన‌ర్ డైలాగుల‌`ను చెప్పారు. సుమ అంద‌రితో బాల‌య్య పంచ్ డైలాగుల్ని చెప్పించారు. అదే స‌మ‌యంలో ఎన్బీకే వంతు వ‌చ్చింది. ఆయ‌న మ‌న తెలుగు హీరోల పంచ్ ప‌వ‌రేంటో చూపించారు. తెలుగు వాడి స‌త్తాను వివ‌రిస్తూ బాలీవుడ్ వాళ్లు ఎలా కాపీ కొట్టారో కూడా వివ‌రించారు.

ఎన్బీకే మాట్లాడుతూ.. ``వ‌న్ లైన‌ర్స్ స్టార్ట్ అయింది నాతోనే.. నాతోనే అంటే నా డైరెక్ట‌ర్స్ ఇమేజిన్ చేసుకుని, నా ర‌చ‌యిత‌లు బ్ర‌హ్మాండంగా రాసి.. అటువంటి ప‌దునైన డైలాగులు నాకు ఇచ్చారు.....పేజీలు పేజీలు డైలాగులు కాదు..ఇవి వ‌న్ లైన‌ర్స్`` అని అన్నారు.

కొంత‌మంది హీరోలు.. బాలీవుడ్ హీరోలు మ‌న నుంచి కాపీ కొట్టి రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసుకున్నారు.. అయిపోయాడు అనుకున్న ఆర్టిస్టు(పొరుగు వాళ్లు).. వెంటిలేట‌ర్ పై ఉన్న ఆర్టిస్టు మ‌ళ్లీ ఊపిరి పోసుకున్నారు అంటే అది మ‌న వ‌ల్లే. మ‌న ద‌ర్శ‌కులు అయితేనేమి.. రైట‌ర్లు అయితేనేమి.. సంగీత ద‌ర్శ‌కులు అయితేనేమి...మ‌న‌ ప్ర‌తిభ‌ వ‌ల్ల‌నే వారు కోలుకున్నారు.. అదీ మ‌న‌ తెలుగు వాళ్ల‌ స‌త్తా..! అని అన్నారు. 60 ప్ల‌స్ లోను ఎన్బీకే కాన్ఫిడెన్స్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. తెలుగోడి స‌త్తా గురించి ఆయ‌న మాట్లాడే ప్ర‌తి మాటా అంద‌రిలో స్ఫూర్తిని నింపాయి.