డాకు మహరాజ్.. ఓ టార్గెట్ ఫినిష్
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తోంది.
By: Tupaki Desk | 18 Jan 2025 5:22 PM GMTనందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తోంది. సినిమా మొదటి రోజున భారీ వసూళ్లతో ప్రారంభమై, ఆ తర్వాత కొంత స్లో అయినా, అన్ని ప్రాంతాల్లోనూ హోల్డ్ చూపిస్తూ ప్రేక్షకుల నుంచి బలమైన స్పందనను పొందుతోంది. తొలివారం పూర్తి కాకముందే, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లను సాధించింది. ముఖ్యంగా, కర్ణాటక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సాధించిన ఘనత హాట్ టాపిక్ గా మారింది.
కర్ణాటక మార్కెట్‌లో డాకు మహారాజ్ టోటల్ 6 రోజుల్లో 6 కోట్లు గ్రాస్ సాధించి, బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. ఇది బాలకృష్ణ నటించిన చిత్రానికి ఒక అరుదైన విజయంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా కర్ణాటక బాక్సాఫీస్‌లో తెలుగు చిత్రాలకు బ్రేక్ ఈవెన్ చేరడం ఒక పెద్ద సవాలుగా ఉంటుందనే విషయం తెలిసిందే. కానీ, డాకు మహారాజ్ ఈ సవాలును అధిగమించి అక్కడి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందింది.
అందులోనూ కర్ణాటకలో ఇటీవల విడుదలైన సినిమాలు ఏవి కూడా బాక్సాఫీస్ వద్ద టార్గెట్ ను ఫినిష్ చేసుకోలేకపోయాయి. ఇక 2025లో అక్కడ ఫస్ట్ బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమాగా డాకు మహరాజ్ ఓ రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ సినిమా ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మార్కెట్‌లో ఇప్పటి వరకు సూపర్ హిట్ స్థాయిలో నిలుస్తూ భారీ వసూళ్లు అందుకుంటోంది.
6 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుంచి 59.44 కోట్ల షేర్ ను సొంతం చేసుకుంది. నైజాం నుంచి 12.92 కోట్లు, సీడెడ్ 10.89 కోట్లు, ఉత్తరాంధ్ర 8.92 కోట్లు, తూర్పు గోదావరి 6.31 కోట్లు, గుంటూరు 7.59 కోట్లు, మరియు కృష్ణా 5.01 కోట్ల వసూళ్లతో ఈ సినిమా కలెక్షన్స్ పరంగా బలంగా కొనసాగుతోంది. కర్ణాటకతో పాటు, ఇతర రాష్ట్రాల మరియు ఓవర్సీస్ మార్కెట్లలోనూ ఈ చిత్రం మంచి వసూళ్లను సాధిస్తోంది.
కర్ణాటక, అలాగే ఇతర రాష్ట్రాల మార్కెట్లలో 3.60 కోట్ల షేర్ అందుకోగా, ఓవర్సీస్ మార్కెట్ నుంచి 7.35 కోట్ల షేర్ సాధించింది. 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సినిమా గ్రాస్ 114.40 కోట్లను దాటింది, షేర్ 70.39 కోట్లను సొంతం చేసుకుంది. మొత్తం మీద, డాకు మహారాజ్ తన 82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు 85% రికవరీ పూర్తి చేసుకుంది.
క్లీన్ హిట్‌గా నిలవడానికి ఇంకా 11.61 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సి ఉంది. సినిమాకు శని, ఆదివారం కీలకమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. కన్నడ బాక్సాఫీస్‌లో తొలి తెలుగు సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ చేరడం ఒక ప్రత్యేక ఘట్టమని చెప్పవచ్చు. ఇది తెలుగు సినిమాలకు మరింత మంచి మార్కెట్‌ని ఏర్పరచే అవకాశం కల్పిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
AP-TG మొత్తం:- 59.44CR (90.05CR~ గ్రాస్)
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా: 3.60Cr షేర్
ఓవర్సీస్ – 7.35Cr సుమారు
మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్లు: 70.39CR